MBBS స్టూడెంట్ దారుణ హత్య: కాళ్లు, చేతులు కట్టేసి..

MBBS స్టూడెంట్ దారుణ హత్య: కాళ్లు, చేతులు కట్టేసి..

భూపాలపల్లి: మెడిసిన్ స్టూడెంట్ ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన శనివారం రేగొండ మండలం కనిపర్తిలో జరిగింది. ఖమ్మంలోని మమతా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనలియర్  చదువుతున్న తుమ్మనపల్లి వంశీ(20) శనివారం ఉదయం బావిలో శవమై కనిపించాడు. కాళ్లు, చేతులు కట్టేసి దుండగులు బావిలో పడేశారు. సంక్రాంతి సెలవుల కోసం సొంత ఊరికి వచ్చిన వంశీ…మూడు రోజుల పాటు కుటుంబ సభ్యులతో గడిపాడు. శుక్రవారం ఉదయం ఖమ్మం కాలేజీకి బయలుదేరిన వంశీ…కాలేజీకి చేరానని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు.

అయితే ఈ ఉదయం పొలం దగ్గరకు వెళ్లిన తల్లిదండ్రులు అక్కడి దృశ్యాలు చూసి షాక్ తిన్నారు. తమ వ్యవసాయ బావివద్ద వంశీ బ్యాగు, చెప్పులు ఉండటంతో ఆందోళన చెందారు. ఈతగాళ్లు బావిలో వెతకగా…వంశీ మృతదేహం లభ్యమైంది. కాళ్లు, చేతులు కట్టిపడేసి ఉన్నాయి. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దర్యాప్తు ప్రారంభించారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టమ్ కోసం హస్పిటల్ కి తరలించారు.  ఎవరో హత్యచేసి ఇక్కడ పడేసి ఉంటారని  పోలీసులు పలుకోణాల్లో విచారణ చేపట్టారు. వంశీకి ప్రేమవ్యవహారాలు ఏమైనా ఉన్నాయా…ఎవరైనా శత్రువులు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.

See Also: 

సంకల్పమే ఆమెను గెలిపించింది: సర్పంచ్ గా 97 ఏళ్ల బామ్మ

8 ఏళ్లుగా బాధపడుతున్న పులికి వరల్డ్ రికార్డ్ సర్జరీ

కేసీఆర్‌తో కొట్లాడైనా నిధులు తెస్తా