కవితపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు

కవితపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు

లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితపై ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దని సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఢిల్లీ మద్యం పాలసీలో తనపై నిరాధార ఆరోపణలు చేసిన బీజేపి ఎంపీ పరవేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సిర్సాపై చర్యలు తీసుకోవాలంటూ కవిత కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియా, మీడియా ముందు నేతలెవరూ ఎలాంటి వాఖ్యలు చేయవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 13కు వాయిదా వేసింది. 

కాగా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కాం వెనక తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల హస్తం ఉందని వెస్ట్ ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ ఇటీవల ఆరోపించారు. ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌‌లో ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి మనీశ్ సిసోడియాతో కేసీఆర్ కుటుంబసభ్యులు భేటీ అయ్యారని, అక్కడే వారికి డీల్ కుదిరిందని తెలిపారు. ఢిల్లీ ఒబెరాయ్ హోటల్లో ఆరు నెలల పాటు సూట్ రూం బుక్ అయి ఉందన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు, సిసోడియా, ఎక్సైజ్ కమిషనర్, లిక్కర్ మాఫియాకు చెందిన వ్యక్తులు, ఎక్సైజ్ అధికారులు హోటల్ రూంలో భేటీ అయి డీల్ గురించి చర్చలు జరిపారని ఆరోపించారు. ‘‘తెలంగాణలో లిక్కర్ మాఫియాకు చెందిన ఓ వ్యక్తి ఏర్పాటు చేసిన ప్రైవేటు విమానంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఢిల్లీ వచ్చేవారు. ఒబెరాయ్ హోటల్లో సూట్ రూం బుక్ చేసింది కూడా ఈ లిక్కర్ మాఫియా వ్యక్తే. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో కలిసి ఆయనే ఈ పాలసీని రూపొందించారు. పంజాబ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో ఇదే లిక్కర్ పాలసీ అమలవుతోంది” అని వర్మ ఇటీవల చెప్పా