నార్సింగి సదర్ ఉత్సవాల్లో ఘర్షణ..పలువురికి గాయాలు

నార్సింగి సదర్ ఉత్సవాల్లో ఘర్షణ..పలువురికి గాయాలు

నార్సింగి మున్సిపాలిటీలో జరిగిన సదర్ ఉత్సవాల్లో ఘర్షణ చెలరేగింది. మున్సిపల్ వైస్ ఛైర్మన్ వెంకటేష్ యాదవ్, మాజీ సర్పంచ్ భర్త అశోక్ యాదవ్ మధ్య వివాదం చోటుచేసుకుంది. దున్నల ఊరేగింపులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని లాఠీచార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం అశోక్ యాదవ్ ఇంటిపై వెంకటేష్ యాదవ్ అనుచరులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో అశోక్ యాదవ్ సహా పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. మొత్తం 13 మందికి గాయాలవ్వగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అంతకుముందు నార్సింగి సదర్ ఉత్సవాల్లో ఆల్ ఇండియా ఛాంపియన్ షిప్ అందుకున్న దున్నపోతు చాంద్ వీర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తీన్మార్ స్టెప్పులేసి అందరిలో జోష్ నింపారు. సినీ నటుడు, మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సదర్ సంబురాలను తిలకించేందుకు వందల మంది నార్సింగికి తరలి వచ్చారు.