ఇంకా క్రిటికల్‌గానే ప్రేమోన్మాది దాడి బాధితురాలు

ఇంకా క్రిటికల్‌గానే ప్రేమోన్మాది దాడి బాధితురాలు

హైదరాబాద్ హస్తినాపూరం ప్రేమోన్మాది కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రేమించి పెళ్లికి నిరాకరించిందని ఓ యువతిపై బస్వరాజ్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. అమ్మాయిపై 18 సార్లు కత్తితో దాడి చేశాడు. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం చంద్రకల్ కు చెందిన యువతిని అదే ప్రాంతానికి చెందిన బస్వరాజ్  కొన్నేళ్లుగా పెళ్లి చేసుకోవాలని వేదిస్తున్నాడు. అయితే రెండు నెలల క్రితం శ్రీధర్ అనే వ్యక్తితో ఆ యువతికి ఎంగెజ్‌మెంట్ అయ్యింది. అప్పటి నుంచి తనను పెళ్లి చేసుకోవాలని బస్వరాజ్ ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించడంతో నిన్న సాయంత్రం హస్తినాపురంలోని అమ్మాయి రూంకు వెళ్లి కత్తితో దాడి చేశాడు. యువతి చేతులు, పొట్టపై తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం పరిస్థితి సీరియస్‌గా ఉంది. ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. ఆమె కడుపు, లంగ్స్‌లో లోతైన కత్తి గాయాలు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. కత్తి పోట్లతో పాటు పిడిగుద్దులు కూడా గుద్దడంతో అమ్మాయి కడుపులో ఇంటర్నల్‌ బ్లీడింగ్ అయిందని, దానిని కంట్రోల్ చేశామని అన్నారు. ఇప్పుడు ఆమె స్పృహలోనే ఉందని, మరో ఆరు గంటల తర్వాత మరోసారి స్కానింగ్ చేసి, సర్జరీ చేయాలా వద్దా అని నిర్ణయిస్తామని డాక్టర్లు చెప్పారు. మరో 24 గంటలు దాటితే అమ్మాయి హెల్త్ కండిషన్ పై స్పష్టత వస్తుందన్నారు.