జ్యోతిష్యం:మిథునరాశిలో గురుడు..శుక్రుడు కలయిక.. నాలుగు రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం...

జ్యోతిష్యం:మిథునరాశిలో గురుడు..శుక్రుడు కలయిక.. నాలుగు రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం...

జ్యోతి ష్య శాస్త్రంలో నవగ్రహాలు.. 27 నక్షత్రాలు.. 12 రాశుల ఆధారంగా పుట్టిన తేది.. సమయాన్ని ఆధారంగా చేసుకొని వ్యక్తుల భవిష్యత్తును పండితులు చెబుతుంటారు. నవగ్రహాల్లో  గురు, శుక్రగ్రహాలకు మంచి ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ రాశుల కలయికను చాలా శుభసూచకంగా పరిగణిస్తారు. అయితే ఈ రెండు గ్రహాలు మిథున రాశిలో మే 18న  కలిసి ధనలక్ష్మి రాజయోగాన్ని ఏర్పరచున్నాయి. దీంతో నాలుగు రాశుల వారికి అనేక విధాలుగా ప్రయోజనం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.  ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. .  .

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయికలు కొన్నిసార్లు అత్యంత శక్తివంతమైన, అరుదైన యోగాలను సృష్టిస్తాయి. అలాంటి అరుదైన సంఘటన మే 18వ తేదీ నుంచి ఆవిష్కృతం కాబోతోంది. నవగ్రహాలలో అత్యంత శుభప్రదుడైన గురు గ్రహం, సంపదలకు అధిపతి శుక్ర గ్రహం.. రెండూ మిథున రాశిలో కలుసుకుంటున్నాయి. గురు-శుక్రుల కలయిక కారణంగా శక్తివంతమైన ధనలక్ష్మి రాజయోగం" ప్రారంభం కానుంది.నాలుగు రాశుల వారు  లక్ష్మీదేవి కటాక్షంతో కుబేరులుగా మారతారు. 

మేష రాశి : గురు..  శుక్ర గ్రహాలు మిథున రాశిలో కలయిక వలన ఈ రాశి వారు ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు.  ధనలక్ష్మి రాజయోగం కారణంగాపట్టిందల్లా బంగారమే అవుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. జాబ్​ కోసం ఎదరురు చూసే వారు గుడ్​న్యూస్​ వింటారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది.  ఆఫీసర్ల మద్దతు పుష్కలంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు.  కుటుంబంలో నెలకొన్న విబేధాలు తొలగిపోయి.. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. పెళ్లి కాని వారికి కూడా మంచి సంబంధం కుదిరే ఛాన్స్ ఉంది. వైవాహిక జీవితం బాగుంటుంది. సమాజంలో మంచి గౌరవం పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చాలా గౌరవంగా చూస్తారని  పండితులు చెబుతున్నారు. 

కర్కాటక రాశి:  మిథురాశిలో గురుడు.. శుక్రుడు కలిసి ధనలక్ష్మి రాజయోగాన్ని ఏర్పరచుట వలన ఈ రాశి వారు అప్పుల సమస్యల నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంది.  సొంతింటిని ఏర్పరచుకొనేందుకు ప్లాన్​ వేస్తారు.  ఈ రాశి వారికి అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.  వ్యాపారం కోసం దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.  చేతి వృత్తుల వారికి అనుకోకుండా ఆర్డర్లు వస్తయి.  ఈ రాశి వారు గతంలో నిలిచిపోయిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. వృత్తి జీవితంలో మీ గ్రాఫ్ ఒక్కసారిగా పైకి లేస్తుంది. వ్యాపారస్తులు అధికంగా లాభాలు పొందుతారు.   ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు అన్ని విషయాల్లో మంచి ఫలితాలుంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

తులారాశి : గురు.. శుక్ర గ్రహాల కలయికతో ఈ రాశి వారికి అదృష్టం వరించనుంది,  జీవితంలో స్థిరత్వం పొందే అవకాశం ఉంది.  ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది.  వృత్తి పరంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి.  ఏ పని చేసినా కలసి వస్తుంది. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. మొండి బాకీలు అనుకోకుండా వసూలవుతాయి.  మానసిక ప్రశాంతత లభిస్తుంది.  ఉద్యోగస్తులు కార్యాలయంలో కీలక పాత్ర పోషిస్తారు.  వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

 ధనస్సు రాశి : గురుడు.. శుక్రుడు .. మిథునరాశిలో కలవడం వలన ఈ రాశి వారిని అదృష్ట లక్ష్మి ప్రత్యేకంగా కరుణిస్తుందని పండితులు చెబుతున్నారు. పాత అప్పులు తీర్చే అవకాశం ఉంది.  వృత్తి పరంగా లైఫ్​ లో సక్సెస్​ సాధిస్తారు. కెరీర్​ లక్ష్యాలను సాధించడంలో సఫలీకృతులవుతారని పండితులు చెబుతున్నారు. అనుకోకుండా పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్​ తో పాటు జీతం పెరిగే అవకాశం ఉంది.  ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు గుడ్​ న్యూస్​ వింటారు.ఇల్లు, భూములకు సంబంధించిన వివాదాలు, కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.