మాస్క్​ పెట్టినా మేకప్​ ఓకే

మాస్క్​ పెట్టినా మేకప్​ ఓకే

పండుగల సీజన్​లో మేకప్, యాక్సెసరీస్​​ వేసుకోకుండా ఉండలేరు చాలామంది. మేకప్​ వేసుకున్న తర్వాత మాస్క్​ పెట్టుకుంటే కంఫర్ట్ అనిపించదు. వేడుకల వేళ కూడా కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే ఫ్యాషనబుల్​గా కనిపించొచ్చు అంటున్నాడు ఫ్యాషన్​ ఎక్స్​పర్ట్ అభిషేక్​ దత్తా. అతడు చెబుతున్న టిప్స్​ కొన్ని. అడ్జస్టబుల్​ లాంగ్​ స్ట్రాప్​ ఉన్న మాస్క్​ ఎంచుకుంటే చెవి రింగులు​, కళ్లద్దాలకి  అడ్డం రావు. వెల్​క్రో, టై–అప్​ స్ట్రాప్స్ ఉన్న మాస్క్​ పెట్టుకుంటే చెవులు నొప్పి పెట్టవు.  డాంగ్లర్స్ లాంటివి కాకుండా చిన్న సైజ్​ ఇయర్​ రింగ్స్​ పెట్టుకోవాలి. హూప్స్​, డాంగ్లర్స్​ పెట్టుకున్నప్పుడు ఎక్స్​టెండెడ్​ చెయిన్​ ఉన్న మాస్క్​ వాడితే బెటర్.  వేడుక ముగిశాక హడావిడిగా మాస్క్​ తీయొద్దు. ముందుగా ఒకవైపు స్ట్రాప్​ తీసి మాస్క్​ తియ్యాలి. మేకప్ ఇలా ఉండాలి   గ్లాసీ లిప్​స్టిక్​ బదులు మ్యాటీ లిప్​ కలర్​ వేసుకోవాలి. ఇదైతే చాలాసేపు నిలిచి ఉంటుంది. మ్యాటీ ఫౌండేషన్​ రాసుకున్నాక  లిప్​స్టిక్​ వేసుకోవాలి. లిప్​లైనర్​, లిప్​బామ్ రాసుకుంటే లిప్​స్టిక్​ చెదరదు. తర్వాత  టిష్యూ పేపర్​తో లిప్స్​ని అద్ది మాస్క్​ పెట్టుకోవాలి. క్విక్​ టచప్​ కోసం లిప్​స్టిక్ వెంట ఉంచుకోవాలి. ఫౌండేషన్​ తక్కువ వేసుకుని పౌడర్​ వేయాలి. బయటికెళ్లే ముందు మళ్లీ కొంచెం పౌడర్ వేస్తే సరిపోతుంది. కళ్లు అట్రాక్టివ్​గా కనిపించా లంటే గ్లిట్టరీ ఐ–షాడో కలర్స్​ వాడాలి. మాస్క్​ పెట్టుకున్నప్పుడు క్రీమీ బ్లష్​ వాడొద్దు. సర్జికల్​ మాస్క్​ పెట్టుకుంటే మేకప్​ ఎక్కువ అంటుకోదు. ఈ టైంలో లిక్విడ్​ మేకప్​ ప్రొడక్ట్స్​​ జోలికి వెళ్లకపోవడమే మంచిది. మాస్క్​ వల్ల ముఖంపై టెంపరేచర్​పెరిగి చెమట, ఉక్కపోతలాంటి సమస్యలొస్తాయి. దాంతో లిక్విడ్ మేకప్​ క్షణాల్లో కరిగిపోతుంది పైగా మాస్క్​ కూడా పాడవుతుంది. అందుకే  ఈ టైంలో  పౌఢర్​ బేస్డ్ మేకప్ ​ ప్రొడక్ట్స్​ వాడాలి. మాస్క్​ పెట్టుకునేటప్పుడు బీబీ క్రీమ్స్​కి దూరంగా ఉండాలి.