గ్రేటర్ లో డివిజన్ల విభజన సక్కగ లేదు

గ్రేటర్ లో డివిజన్ల విభజన సక్కగ లేదు

ఈసీకి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లెటర్

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ లో డివిజన్ల విభజన కరెక్టుగా చేయలేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి ఆరోపించారు. మొత్తం 150  డివిజన్లు ఉంటే 140 చోట్ల ఓటర్లు ఎక్కువ, తక్కువ ఉన్నారని అన్నారు. ప్రతి డివిజన్ లో యావరేజ్ గా 49 వేల మంది ఓటర్లు ఉండాలని, కానీ 10 డివిజన్లలోనే ఓటర్ల సంఖ్య కరెక్టుగా ఉందన్నారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా డివిజన్ల విభజన చేపట్టాలని డిమాండ్ చేశా రు. ఈ మేరకు బుధవారం ఎలక్షన్ కమిషనర్ పార్థసారథికి లెటర్ రాశారు. డివిజన్లలో సమానంగా ఓటర్లు లేకపోవడంతో నిధుల కేటాయింపులో అన్యాయం జరుగుతోందన్నారు. మైలార్ దేవ్ పల్లి డివిజన్​లో 79,290 మంది ఓటర్లు ఉంటే.. ఆర్సీపురంలో  27,831 మందే ఉన్నారని చెప్పారు. దీన్ని బట్టి డివిజన్లను ఎట్ల విభజించా రో అర్థం చేసుకోవచ్చన్నారు.