గాంధీలో బాలికకు అరుదైన సర్జరీ

గాంధీలో బాలికకు అరుదైన సర్జరీ
  • చికిత్సను సక్సెస్ చేసిన పీడియాట్రిక్ విభాగ డాక్టర్లు 

పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆస్పత్రి డాక్టర్లు అరుదైన, క్లిష్టమైన సర్జరీని చేసి బాలిక​ ప్రాణాలు కాపాడారు.  ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొ.రాజారావు సోమవారం సర్జరీ వివరాలను మీడియాకు  వెల్లడించారు.  మహారాష్ట్రలోని నాందేడ్​కు చెందిన11 ఏండ్ల బాలిక సంధ్య కొంతకాలంగా బ్లడ్​ ప్రెషర్, తలనొప్పి, కండ్లు తిరగడం , చెమట, వాంతుల వంటి హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ గాంధీ ఆస్పత్రికి వచ్చింది. పీడియాట్రిక్ ​సర్జరీ విభాగ డాక్టర్లు స్కానింగ్, టెస్ట్ లు చేసి బాలిక కడుపులో కిడ్నీలపైన రెండు కణితిలు ఉన్నట్లు, అది.. ఈ ఫియోక్రోమోసైటోమా వ్యాధిగా గుర్తించారు.  ప్రతి 50 వేల మందిలో ఒకరికి అలాంటి వ్యాధి  కుటుంబపరంగా వస్తుందని డాక్టర్లు పేర్కొన్నారు.  

బాలిక తల్లి, అత్త, మామ, తాతలకు కూడా ఇలాంటి వ్యాధి ఉన్నట్టు నిర్ధారణ అయిందని తెలిపారు. కేసును చాలెంజ్ గా తీసుకుని ఆస్పత్రి పీడియాట్రిక్​సర్జరీ విభాగ హెచ్ఓడీ ప్రొఫెసర్​ డాక్టర్ కె. నాగార్జున ఆధ్వర్యంలో డా.శ్రీనివాస్​, డా.అశ్రిత్ రెడ్డి, డా.హర్ష, డా.మురళీధర్​లతో  పీడియాట్రిక్​, అనెస్తీషియా  రేడియాలజీ, ఓటీ నర్సింగ్​విభాగాలు ఇటీవల లాపరోస్కోపి పద్ధతిలో  సర్జరీ చేశారు.  బాలిక కడుపులోని రెండు కణితిలను తొలగించి ఆపరేషన్ సక్సెస్ చేశారు. బాలిక డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లి తిరిగి పూర్తి ఆరోగ్యంతో సోమవారం రివ్యూకు వచ్చింది. చిన్నారి  సర్జరీని సక్సెస్​ చేసిన పీడియాట్రిక్​సర్జరీ విభాగ వైద్య సిబ్బందిని సూపరింటెండెంట్​ప్రొ.రాజారావు 
అభినందించారు.