TSPSC ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాల పరీక్ష తేదీల్లో మార్పు

TSPSC ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాల పరీక్ష తేదీల్లో మార్పు

తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు, సాంకేతిక విద్యా కమిషనరేట్ పరిధిలోని కాలేజీల్లో ఫిజికల్‌ డైరెక్టర్‌ (పీడీ) ఉద్యోగాలకు సంబంధించిన అర్హత పరీక్ష వాయిదా పడింది.

సెప్టెంబర్ 11వ తేదీన జరగాల్సిన ఫిజికల్‌ డైరెక్టర్‌ పరీక్ష నవంబర్‌ 14వ తేదీకి వాయిదా పడింది. 14న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు, తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు కమిషన్ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు.

Also read :- హైదరాబాద్లో వైరల్ ఫీవర్స్ చూసి భయపడొద్దు

పరీక్షకు వారం ముందు వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) తెలిపింది.