249 మందితో ఢిల్లీ చేరుకున్న  మరో విమానం

249 మందితో ఢిల్లీ చేరుకున్న  మరో విమానం

'ఆపరేషన్ గంగ'లో భాగంగా ఇవాళ ఉదయం ఉక్రెయిన్ యుద్ధ భూమి నుంచి మరో విమానం వచ్చింది. రొమోనియా నుంచి ఢిల్లీ చేరుకున్న ఈ విమానంలో 249 మంది భారతీయులు ఉన్నారు. దీంతో ఇప్పటి వరకు భారత్ చేరుకున్న 5 విమానాల్లో కలిపి మొత్తం 1,156 మంది భారతీయులు స్వదేశానికి తిరిగివచ్చారు.

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ లోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగ‘ పేరుతో ఎవాక్యుయేషన్ ప్రారంభించింది.  ఉక్రెయిన్ తమ ఎయిర్ స్పేస్ లో నిషేధం విధించడంతో అక్కడ చిక్కుకున్న విద్యార్థులను సరిహద్దులకు చేర్చి పొరుగు దేశాల నుంచి ఎయిర్ ఇండియా విమానాల్లో స్వదేశానికి తీసుకొస్తోంది. ఇప్పటికే నాలుగు విమానాల్లో 907 మంది భారత్ రాగా.. ఇవాళ ఉదయం మరో 249 మంది ఢిల్లీ చేరుకున్నారు. 

కాగా, ఆపరేషన్ గంగాలో భాగంగా విద్యార్థులను తరలించేందుకు మరిన్ని విమానాలు పంపుతున్నట్లు ఎయిరిండియా తెలిపింది. ఒక్కో విమానం గమ్యస్థానాలకు వెళ్లి తిరిగి రావడానికి కోటి 10 లక్షలు ఖర్చువుతుందని కేంద్రం అంచనా వేసింది. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భఆరతీయులను స్వదేశానికి తరలించేందుకు రెండు విమానాలు నడపనున్నట్లు ఇండిగో సంస్థ తెలిపింది. సోమ, మంగళ వారాల్లో ఢిల్లీ నుంచి ఇస్తాంబుల్ మీదుగా బుడాపెస్ట్ కు వెళ్తాయని సమాచారం.