గాజుల రామారంలో అగ్ని ప్రమాదం.. అపార్ట్ మెంట్ లో పేలిన గీజర్.. ఫ్లాట్ మొత్తం దగ్ధం

గాజుల రామారంలో అగ్ని ప్రమాదం.. అపార్ట్ మెంట్ లో పేలిన గీజర్..  ఫ్లాట్ మొత్తం దగ్ధం

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గాజులరామారం పరిధిలోని కైలాస్ హిల్స్‌లో ఉన్న ఒక అపార్ట్మెంట్‌లో గీజర్ పేలడంతో  ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

అపార్ట్మెంట్‌లోని రెండవ అంతస్తులో ఉన్న ఒక ప్లాటులో గీజర్ ఒక్కసారిగా పేలిపోయింది. భారీ శబ్దంతో గీజర్ పేలడంతో  క్షణాల్లోనే మంటలు ఆ ఫ్లోర్ మొత్తం వ్యాపించాయి. మంటల ధాటికి ఆ ప్లాటులోని సామాగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యింది.

ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదని  తెలుస్తోంది. ఘటనపై   పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.