ది ఫ్లాష్ మూవీ ట్రైలర్ నెక్స్ట్ లెవల్.. మరి ఆదిపురుష్ సంగతేంటి?

ది ఫ్లాష్ మూవీ  ట్రైలర్ నెక్స్ట్ లెవల్.. మరి ఆదిపురుష్ సంగతేంటి?

వార్నర్ బ్రదర్ ప్రొడక్షన్ హౌస్ నుండి వస్తున్న మరో భారీ చిత్రం ‘ది ఫ్లాష్’. ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. తాజాగా ఈ సినిమా ఫైనల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. DCU లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ది ఫ్లాష్’ ఫైనల్ ట్రైలర్ సెన్సేషనల్ వ్యూస్ ని రాబడుతోంది. దానికి కారణం ఈ ట్రైలర్ లో బాట్ మాన్, సూపర్ వుమెన్ కూడా కనిపించడం. అంతేకాదు జనరల్ జాడ్ గా మైఖేల్ షనన్ కనిపించడంతో ది ఫ్లాష్ ట్రైలర్ మరింత స్పెషల్ గా మారింది. 

సూపర్బ్ విజువల్ ఎఫెక్ట్స్, ఎక్సలెంట్ బీజీఎం కలిపి ట్రైలర్ ను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్ళాయి. ఈ ఒక్క ట్రైలర్ తో సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇదే రేంజులో గనక సినిమా ఉంటే.. DCUలో ది ఫ్లాష్ మూవీ చాలా స్పెషల్ అయ్యే అవకాశం ఉంది. నిజానికి బాట్ మాన్ క్యారెక్టర్, సిరీస్ కి ఇండియాలో సూపర్ ఫాలోయింగ్ ఉంది. కాబట్టి ఈ మూవీ ఇండియాలోని A సెంటర్స్ లో సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టే అవకాశం ఉంది. 

అయితే ఇక్కడ అసలు విశయం ఏంటంటే..  ది ఫ్లాష్ మూవీ రిలీజ్ అవుతున్న రోజే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’ కూడా రిలీజ్ కాబోతోంది. ఓం రౌత్ డైరెక్ట్ తెరకెక్కించిన ఈ మూవీతో ఇంటర్నేషనల్ మార్కెట్ ను కూడా ఏలెయ్యాలని  ఫిక్స్ అయ్యాడు ప్రభాస్. ఇప్పుడు ఈ సినిమాకి ది ఫ్లాష్ సినిమా నుండి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఇండియాలో ప్రభాస్ ఇంపాక్ట్ కూడా ది ఫ్లాష్ మూవీపై గట్టిగానే పడుతుంది.

 ఇలా ఈ రెండు సినిమాలు ఒకే డేట్ కి రిలీజ్ అవుతుండడంతో ఆయా సినిమాల అభిమానులు కంగారు పడుతున్నారు. ది ఫ్లాష్ సినిమాకి పాజిటీవ్ టాక్ వస్తే ఆదిపురుష్ పరిస్థతి ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగా ఆడియన్స్ అనుకుంటున్నట్టు ది ఫ్లాష్ మూవీ నుండి ఆదిపురుష్ సినిమాకు ఇబ్బందులు ఉంటాయా అనేది తెలియాలంటే జూన్ 16 వరకు ఆగాల్సిందే.