
హైదరాబాద్, వెలుగు: ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను వరద ముంచెత్తుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కులు, ఆల్మట్టికి 1.16 లక్షలు, నారాయణపూర్‌కు 1.35 లక్షలు, ఉజ్జయినికి 28,583, జూరాలకు 1.9 లక్షల క్యూసెక్కులు, తుంగభద్రకు 77,553 క్యూస్కెకుల ఇన్‌ఫ్లో వస్తోంది. పైనుంచి నిలకడగా ప్రవాహాలు కొనసాగే చాన్స్ ఉండటంతో రెండ్రోజుల్లో మళ్లీ శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశముంది. ఇక గోదావరి బేసిన్‌లో ఎస్సారెస్పీకి 24 గంటల్లో టీఎంసీ నీరొచ్చింది.
ప్రాజెక్టు పూర్తి నిల్వ ప్రస్తుత నిల్వ ఇన్‌ఫ్లో ఔట్‌ఫ్లో
ఆల్మట్టి 129.72 111.29 1,16,200 1,36,664
నారాయణపూర్ 37.64 35.06 1,35,000 1,33,666
ఉజ్జయిని 117.24 117.24 28,583 30,000
జూరాల 9.66 9.00 1,90,000 2,03,309
తుంగభద్ర 100.86 99.42 77,553 85,993
శ్రీశైలం 215.81 182.60 1,00,987 95,963
నాగార్జునసాగర్ 312.05 298.88 23,620 23,620
పులిచింతల 45.77 44.64 9,753 5,000
జైక్వాడి 102.73 91.74 1,670 1,670
ఎస్సారెస్పీ 90.31 28.49 4,690 484
మిడ్ మానేరు 25.87 8.98 0 4,583
ఎల్‌ఎండీ 24.07 10.46 5,112 257
కడెం 7.60 7.11 486 394
ఎల్లంపల్లి 20.18 10.52 0 0