ఆస్తి కోసం అంత్యక్రియలు అడ్డుకున్నారు

ఆస్తి కోసం అంత్యక్రియలు అడ్డుకున్నారు

భీమదేవరపల్లి, వెలుగు: ఆస్తి కోసం అంత్యక్రియలు అడ్డుకున్న ఘటన వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలో బుధవారం జరిగింది. కొత్తపల్లి గ్రామానికి చెందిన శ్రీపతి స్వరాజ్యం ఎల్కతుర్తి మండలం జీల్గుల గ్రామానికి చెందిన సరోజనను రెండో పెండ్లి చేసుకున్నాడు. ఈ దంపతుల ఇద్దరు కూతుళ్లలో పెద్ద బిడ్డ ప్రేమలతకు పెద్దలు కుదిర్చిన పెండ్లి జరిగింది. చిన్న బిడ్డ కల్యాణి ఓ దళిత యువకుడ్ని ప్రేమ పెళ్లి చేసుకోవడంతో తండ్రి శ్రీపతి.. సరోజనను ఇంట్లోంచి గెంటేశాడు. ఆమె ఆనారోగ్యంపాలై మంగళవారం రాత్రి చనిపోయింది. దీంతో సరోజన డెడ్​బాడీని శ్రీపతి ఇంటి ముందు ఉంచారు. తల్లి డెడ్​బాడీని కడసారి చూసేందుకు వచ్చిన ఇద్దరు కూతుళ్లు ఆస్తిలో వాటా కావాలని అడగడంతో గొడవ మొదలైంది. మొదట నిరాకరించిన శ్రీపతి పెద్దలు సర్దిచెప్పడంతో ఒప్పుకుని ఇద్దరు బిడ్డలకు వాటా ఇస్తానని హామీ ఇవ్వడంతో బుధవారం అంత్యక్రియలు జరిగాయి.

see more news

రాజకీయ పార్టీలకు ‘‘సాగర్’’ సవాల్ ​

సీజ్ చేసిన పైసల్ని వడ్డీతో కలిపి కట్టండి