గద్వాల కలుషిత నీటి ఘటనలో కోలుకోని బాధితులు

గద్వాల కలుషిత నీటి ఘటనలో కోలుకోని బాధితులు
  • ​​​​మెరుగైన ట్రీట్ మెంట్ పై పట్టించుకోని అధికారులు
  • ఉలుకూ, పలుకూలేని ప్రభుత్వం.. స్పందించని ప్రజా ప్రతినిధులు
  • గద్వాల కలుషిత నీటి బాధితులను పట్టించుకునే వారే కరవు
  • ఆస్పత్రిలో ఇప్పటికీ చికిత్స పొందుతున్న వారు 25 మందిపైనే.. 
  • గద్వాలలో కలుషిత నీటి బాధితుల్లో ఇప్పటికే నాలుగుకు చేరిన మృతులు

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మిషన్ భగీరథ కలుషిత ఘటనపై ప్రభుత్వం కానీ, ప్రజాప్రతినిధులు కానీ స్పందించడం లేదు. ఘటన జరిగి 4 రోజులైనా.. అటు మొకాన చూసిన నాథుడే లేడు. నలుగురు చనిపోయి..25నుంచి 30మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 15మంది పెద్దలు, మిగతావాళ్లు పిల్లలు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే మిషన్ భగీరథ వాటర్ పొల్యూషన్ తోనే ఈ ఘటన జరిగిదంటున్నారు స్థానికులు. లోకల్ మెడికల్ సిబ్బంది టెస్టులు చేసి ప్రాథమికంగా కలుషితే నీరే కారణమని తేల్చారు. మరోవైపు జిల్లా మెడికల్ సూపరింటెండెంట్ మాత్రం ఇవి సీజనల్ వ్యాధులను చెబుతున్నారు. వర్షాకాలంలో మొదటి వర్షాలకు ఇలాంటి వ్యాధులు వస్తాయని చెప్పుకొచ్చారు.
ఘటన జరిగి నాలుగైదు రోజులైనా..నలుగురు చనిపోయినా పట్టించకునేనాథుడే లేకుండా పోయాడు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలను పరామర్శించిన దాఖలాలు లేవు. పైగా మిషన్ భగీరథ కలుషిత నీటితోనే మరణాలు జరిగాయనడం సరికాదంటున్నారు గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. అనారోగ్యం, వయస్సుపైబడి చనిపోయారని చెప్పారు. అసలు పదుల సంఖ్యలో జనం అస్వస్థతకు గురవడానికి కారణమేంటో  మాత్రం చెప్పడం లేదు. కారణమేదైనా 30మంది వరకు అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. వాళ్లను పరామర్శించడం కానీ.. ఘటన జరిగిన కాలనీలో హెల్త్ క్యాంప్ పెట్టడం కానీ చేయడం లేదు. స్థానికులు మాత్రం పొల్యూషన్ వాటర్ వల్లే ఘటన జరిగిదంటున్నారు. నీళ్లు బాగొస్తలేవని..పలుసార్లు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదంటున్నారు.

ఆర్ధిక సాయంతోపాటు ఉద్యోగాలివ్వాలి: డీకే అరుణ
గద్వాలలో కలుషిత నీరు తాగి మృతి చెందిన కుటుంబాలకు ఆర్థికసాయంతో పాటు ఉద్యోగం ఇవ్వాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. మళ్లీ ఇటువంటి సంఘటనలు జరక్కుండా చర్యలు తీసుకోవాలన్నారు. గద్వాల ప్రభుత్వ ఆస్పత్రిలో కలుషిత నీటి బాధితులను శుక్రవారం ఆమె పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని డీకే అరుణ వారికి సూచించారు.