ప్రభుత్వం నాసిరకమైన చేప పిల్లలు పంపిణీ చేసింది

ప్రభుత్వం నాసిరకమైన చేప పిల్లలు పంపిణీ చేసింది

తెలంగాణలో మత్స్యకారులకు నాసిరాకమైన చేప పిల్లలను ప్రభుత్వం పంపిణీ  చేసిందని ఆరోపించారు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం. యాదాద్రి భువనగిరిలో మత్స్య కార్మికుల చేపట్టిన దీక్షకు మద్దతు ఇచ్చిన ఆయన…చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం తెలంగాణ లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చేపలు అమ్ముకోడానికి మార్కెట్ సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రభుత్వం ప్రకటనలకు మాత్రమే పరిమితమైందనడానికి భువనగిరి లో మత్స్యకార్మికలు చేస్తున్న దీక్షే ఓ నిదర్శనమన్నారు. ప్రభుత్వ పథకాలు అన్ని వర్గాలకు చేరడం లేదన్న కోదండరాం..ఒకసారి ప్రభుత్వ పెద్దలు సమీక్ష చేసుకోవాలన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై సమాధానమివ్వని సీఎం కేసీఆర్… ఉన్న భవనాలను కూల్చుతూ కొత్త బిల్డింగ్ లు కట్టించేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఆరోపించారు కోదండరాం.