ఈరోజు నుంచి ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్

ఈరోజు నుంచి ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్

ఇంజనీరింగ్​ ఫీజుల జీవో రాకుండానే ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులపై సర్కారు ఇంకా ఏమీ తేల్చలేదు. టీఏఎఫ్ఆర్సీ అధికారులు 173 కాలేజీల మేనేజ్మెంట్లతో హియరింగ్ నిర్వహించి, ఫీజుల ప్రతిపాదనలను ఇటీవలే ప్రభుత్వానికి పంపించారు. అయితే ఆ ఫీజులపై అధికారికంగా జీవో ఇవ్వాల్సి ఉన్నా, ప్రభుత్వం ఇంకా రిలీజ్ చేయలేదు. దీంతో స్టూడెంట్లకు ఏ కాలేజీలో ఎంత ఫీజు అనే వివరాలపై అయోమయం నెలకొంది. మరోపక్క ఎంసెట్ (ఇంజనీరింగ్) సెకండ్ ఫేజ్ వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభవుతోంది.

ఈ నెల 12, 13న వెబ్ఆ ప్షన్ల ప్రక్రియ పూర్తికానుంది. 16న సీట్ల అలాట్మెంట్ చేస్తారు. అయినా ఇప్పటికీ ఫీజులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. కాగా ఎంసెట్ సెకండ్ ఫేజ్ అడ్మిషన్  కౌన్సెలింగ్​కు 22,820 సీట్లు అందుబాటులో ఉన్నాయని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ ప్రకటించారు.