టీ‑హబ్​ 2.0 లాంఛ్​ 28 న..

టీ‑హబ్​ 2.0 లాంఛ్​ 28 న..

హైదరాబాద్​, వెలుగు: బిజినెస్​ ఇంక్యుబేటర్​ టీ–హబ్​2.0 ను ఈ నెల 28 న లాంఛ్​ చేయనున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త బిల్డింగ్​లో మొత్తం 5.82 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉంటుందని, ప్రపంచంలోనే పెద్ద ఇన్నొవేషన్​ క్యాంపస్ ​అవుతుందని పేర్కొంది. ఫ్రాన్స్​లోని స్టేషన్​ ఎఫ్​ తర్వాత రెండో పెద్ద స్టార్టప్​ ఇంక్యుబేటర్​గానూ నిలుస్తుందని తెలిపింది. స్టార్టప్​కంపెనీలను ప్రోత్సహించడానికి 2015లో మొదటిసారిగా టీ–హబ్​ను హైదరాబాద్​లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇన్నొవేషన్​ ఎకోసిస్టమ్​ను ఏర్పాటు చేసేందుకు 2 వేల స్టార్టప్​ కంపెనీల ఏర్పాటుకు వీలు కల్పించేలా టీ–హబ్​2.0 తెస్తున్నట్లు ప్రభుత్వం ఈ ప్రకటనలో వివరించింది. స్టార్టప్​లు, కార్పొరేట్లు, ఇన్వెస్టర్లు, అకాడమియా...అందరినీ టీ–హబ్​2.0 ఒక చోటికి చేరుస్తుందని టీ–హబ్​ సీఈఓ మహంకాళి శ్రీనివాస రావు చెప్పారు. గత ఆరేళ్లలో టీ–హబ్​ ఇంక్యుబేటర్​ లెవెల్​ నుంచి ఇన్నొవేటర్​ లెవెల్​కు ఎదిగిందని పేర్కొన్నారు. తన ప్రోగ్రామ్స్​తో 1,800 స్టార్టప్​లకు టీ–హబ్​ చేరువైందని తెలిపారు.