
కరీంనగర్ జిల్లా నగునూరులో కొత్త వ్యవసాయ చట్టాలపై కరపత్రం విడుదల చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కొత్త వ్యవసాయ చట్టాలతో రైతు తన పంటను ఎక్కడైనా, ఎవరికైనా నచ్చిన ధరకు అమ్మకోవచ్చని సంజయ్ చెప్పారు. సన్న వడ్లు పండించాలని రైతులకు చెప్పిన కేసీఆర్… తన ఫామ్ హౌస్ లో మాత్రం దొడ్డు రకం వేశాడన్నారు సంజయ్. రైతులు ఎక్కువ మంది సన్నాలు సాగు చేయడంతో దిగుబడి తగ్గి రైతు నష్టపోతున్నాడని సంజయ్ ఆరోపించారు. సన్నాలు పండించిన రైతులకు జరిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని… క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని సంజయ్ డిమాండ్ చేశారు.