షర్మిలను ఎందుకు టార్గెట్ చేస్తున్రు : హైకోర్టు

షర్మిలను ఎందుకు టార్గెట్ చేస్తున్రు : హైకోర్టు

వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. షర్మిల ఇంటి ముందు బారికేడ్లను తొలగించాలని ఆదేశించింది. షర్మిల ఇంటిముందు పోలీసులు ఎందుకు మెహరించారని ప్రశ్నించింది. షర్మిల దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం విచారణ జరిపింది. షర్మిలను నిన్న కోర్టుకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆమె తరపు న్యాయవాది వాదించారు. ఇంట్లో నుండి బయటికి రానివ్వకుండా ప్రతి రోజూ పోలీసులు అడ్డుకుంటున్నారని.. కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా బయటకు రానివ్వడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 

షర్మిల వల్ల తరుచూ శాంతి భద్రతల సమస్య తలెత్తుతోందని గవర్నమెంట్ ప్రాసిక్యూటర్ వాదించారు. బెయిల్ షరతులను షర్మిల ఉల్లంఘించారని..ఎస్ఆర్ నగర్, అంబేద్కర్ విగ్రహం వద్ద ఘటనలను కోర్టుకు వివరించారు. తన కార్యక్రమాలపై పోలీసులకు ఆమె తప్పుడు సమాచారం ఇస్తోందని చెప్పారు. దీంతో రోడ్లపై ఎటువంటి కార్యక్రమాలు చేపట్టొద్దని.. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా బహిరంగ సభలు నిర్వహించొద్దని షర్మిలకు కోర్టు సూచించింది.