కరీంనగర్, వెలుగు: కాలనీలో వరద నీళ్లు బాగా వచ్చాయి, మొరం పోయించమన్నందుకు కరీంనగర్ కార్పొరేషన్ కు చెందిన ఓ డివిజన్ కార్పొరేటర్ భర్త ఆ వ్యక్తిని బెదిరించారు. ఈ ఆడియో కరీంనగర్ జిల్లాలో వైరలైంది. కాలనీలో అన్నీ నీళ్లున్నా య్.. ఎలా పోవాలి.. మొరం పోయించాలి అన్నందుకు కార్పొరేటర్ భర్త ‘నాలుగు రోడ్లున్నయ్ ఏ రోడ్డు నుంచైనా వెళ్లు.. కమిషనర్‌కు కంప్లైంట్ చెయ్.. ఓటేసి నా, ఓటరును అంటున్నావ్..లూజ్ టాక్ చేస్తున్నవ్.. నాలుక దగ్గర పెట్టుకుని మాట్లాడు. మొరం కావాలని రాసివ్వు.
నాకు నచ్చినప్పుడు పోస్తా. తమాషా చేస్తున్నవా, కుక్కను కూసోపెట్టినట్లు కూసోవెడ్త స్టేషన్ల.. ఏడాది దాక మొరం పోయ.. నీ వెంట పడతా. నీ కథలు నాకు తెల్సు.. దుకాణం బంద్ చెయ్యు’ అంటూ బెదిరించారు.
