30 రోజుల్లో.. 11 వందల సార్లు.. భారీ వర్షం పడింది : ఆల్ టైం రికార్డ్

30 రోజుల్లో.. 11 వందల సార్లు.. భారీ వర్షం పడింది : ఆల్ టైం రికార్డ్

ఈ ఏడాది భారతదేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. భారీ వర్షాలపై భారత వాతావరణ శాఖ (IMD) సోమవారం (జులై 31న) ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ను వెల్లడించింది. 

2023, జులై నెలలో అంటే 30 రోజుల్లో 11 వందల సార్లు అత్యధిక వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అత్యధికంగా 315.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని పేర్కొంది. గత ఐదేళ్లలో ఇదే అత్యధిక వర్షపాతమని తెలిపింది. తూర్పు, ఈశాన్య ప్రాంతాలు మినహా అన్ని ప్రాంతాలలోనూ అధిక వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.