అర్ధరాత్రి ఇండ్లకు పోయి అరెస్టు చేయడం ఏంది? : జర్నలిస్ట్ సంఘాలు

అర్ధరాత్రి ఇండ్లకు పోయి అరెస్టు చేయడం ఏంది? :  జర్నలిస్ట్  సంఘాలు
  •     జర్నలిస్టులను అరెస్టు చేసిన తీరు బాధాకరం
  •     జర్నలిస్ట్  సంఘాల మండిపాటు

హైదరాబాద్, వెలుగు: ఎన్టీవీకి చెందిన ఇద్దరు జర్నలిస్టులను స్పెషల్​ ఇన్వెస్టిగేషన్​ టీం (సిట్) పోలీసులు అరెస్టు చేసిన తీరును జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఎలాంటి నోటీసులు, సెర్చ్  వారంట్లు, కనీస విచారణ లేకుండానే అర్ధరాత్రి వేళ జర్నలిస్టుల ఇండ్డకు వెళ్లి అరెస్టు చేయడం కరెక్టు కాదని తెలంగాణ వర్కింగ్  జర్నలిస్ట్స్  ఫెడ రేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) బుధవారం ఒక ప్రకటనలో తప్పుబట్టింది. 

అంతర్జాతీయ నేర స్థుల తరహాలో ఎన్టీవీ జర్నలిస్టులు దొంతు రమేశ్, పరిపూర్ణచారి, సుధీర్‌‌ను అదుపులోకి తీసుకోవడం, వారి కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యేలా వ్యవహరించడంపై టీడబ్ల్యూజేఎఫ్ నేత లు పి.రాంచందర్, బి.బసవపున్నయ్య ఆగ్ర హం వ్యక్తం చేశారు. 

వార్తా కథనాలపై అభ్యంతరాలుంటే ప్రెస్  కౌన్సిల్‌‌కు ఫిర్యాదు చేయాలి తప్ప విధుల్లో ఉన్న జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకోవడం ఏందని మండిపడ్డారు. అరెస్ట్​ చేసిన జర్నలిస్టులను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. అతలాగే, ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలని వారు డిమాండ్  చేశా రు. రాజకీయ నాయకుల అంతర్గత కుమ్ములాటలో వర్కింగ్ జర్నలిస్టులను బలిపశువు చేయరాదని సీనియర్  జర్నలిస్టు కట్టా శేఖర్ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్  ప్రభుత్వంలో ప్రతిపక్షాలను వేధించినట్టే.. ఈ ప్రభుత్వంలోనూ జర్నలిస్టులను టార్గెట్  చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.