లవర్-ను పెండ్లాడేందుకు పెరోల్ మంజూరు చేసిన కర్నాటక హైకోర్టు

లవర్-ను పెండ్లాడేందుకు పెరోల్ మంజూరు చేసిన కర్నాటక హైకోర్టు

మంజూరు చేసిన కర్నాటక హైకోర్టు

బెంగళూరు : లవర్-ను పెండ్లి చేసుకోవడానికి మర్డర్ కేసులో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి కర్నాటక హైకోర్టు15 రోజుల పెరోల్ మంజూరు చేసింది. ఆనంద్ అనే యువకుడు, నీతా జీ అనే యువతి తొమ్మిదేండ్లుగా లవ్ చేసుకుంటున్నారు. అయితే,  ఓ హత్య కేసులో దోషిగా తేలడంతో ఆనంద్‌‌‌‌‌‌‌‌-కు పదేండ్ల జైలు శిక్ష పడింది. ప్రస్తుతం అతను బెంగళూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇదిలా ఉండగా, ఆనంద్‌‌‌‌‌‌‌‌- లవరైన నీతా జీకి పెండ్లి చేయాలని ఆమె కుటుంబసభ్యులు ఇటీవల నిర్ణయించారు. పెద్దలు నిర్ణయించిన పెండ్లి ఇష్టం లేని యువతి, ఆనంద్‌‌‌‌‌‌‌‌ తల్లి రత్నమ్మతో కలిసి ఆనంద్‌‌‌‌‌‌‌‌కు పెరోల్ ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించింది.

తొమ్మిదేండ్లుగా ఆనంద్‌‌‌‌‌‌‌‌, తను లవ్ చేసుకుంటున్నట్లు పిటిషన్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. మర్డర్ కేసులో అతనికి జీవిత ఖైదు పడిందని, దాన్ని పదేండ్లకు తగ్గించారని గుర్తుచేసింది. శిక్షాకాలంలో ఇప్పటికే ఆరేండ్లు పూర్తయ్యాయని తెలిపింది. తనకు వేరొకరితో పెండ్లి చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించినట్లు నీతాజీ ఆవేదన వ్యక్తంచేసింది. మనస్ఫూర్తిగా ప్రేమించిన ఆనంద్‌‌‌‌‌‌‌‌ను కాదని వేరొకరిని పెండ్లి చేసుకోలేనని స్పష్టం చేసింది. అందువల్ల జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆనంద్‌‌‌‌‌‌‌‌కు వెంటనే పెరోల్ మంజూరు చేయాలని నీతాజీ తన పిటిషన్‌‌‌‌‌‌‌‌లో కోరింది. ఈ పిటిషన్ పై కర్నాటక హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది.

పిటిషనర్ అప్పీల్‌‌‌‌‌‌‌‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు,  జైలు నిబంధనలలోని సెక్షన్ 636లోని సబ్-సెక్షన్ 12 ప్రకారం పిటిషన్-ను అసాధారణ పరిస్థితిగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. ప్రియురాలిని పెండ్లి చేసుకోవడానికి ఆనంద్‌‌‌‌‌‌‌‌ను ఈ నెల 5 నుంచి 20వ తేదీ సాయంత్రం వరకు పెరోల్‌‌‌‌‌‌‌‌పై రిలీజ్ చేయాలని జైలు అధికారులను  
ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.