
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియాను తన లుక్ తో షేక్ చేస్తున్నాడు. ప్రతిసారి స్టైలిష్ లుక్ తో అట్రాక్టివ్ గా కనిపించే కింగ్ కోహ్లీ ఈ సారి మాత్రం తన సాధారణ లుక్ తో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. వన్డే క్రికెట్ మాత్రమే ఆడుతున్న కోహ్లీ ప్రస్తుతం లండన్ లో ఉన్నాడు. శుక్రవారం (ఆగస్టు 8) లండన్‌లో షాష్ పటేల్ అనే వ్యక్తితో కోహ్లీ దిగిన ఫోటో ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ ఫోటోలో పూర్తిగా తెల్ల గడ్డంతో కోహ్లీ కనిపించడం షాకింగ్ గా అనిపిస్తోంది. 36 ఏళ్లకే కోహ్లీ పూర్తిగా తెల్ల గడ్డంతో కనిపించడంతో ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదు.
చాలా రోజుల తర్వాత కోహ్లీని చూసి ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్ కు కోహ్లీ వింత అనుభవాన్ని ఇచ్చాడు. కొంతమంది నెటిజన్స్ అయితే ఏమైంది బాస్.. ఏంటా లుక్క్ అంటూ తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. నెల క్రితమే కోహ్లీ వింబుల్డన్ టోర్నీ చూడడానికి వచ్చిన కోహ్లీ స్టైలిష్ లుక్ లో అదరగొట్టాడు. అప్పుడే కోహ్లీ తన గడ్డంపై తానే సెటైర్ వేసుకున్నాడు. యువరాజ్ సింగ్ తన YouWeCan ఫౌండేషన్ కోసం నిర్వహించిన గాలా డిన్నర్ వేదికగా మాట్లాడుతూ..‘‘ రెండు రోజుల క్రితం గెడ్డానికి రంగు వేసుకున్నాను. ప్రతీ నాలుగు రోజులకు ఒకసారి గెడ్డానికి రంగు వేసుకుంటున్నామంటే.. టైం వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి’’ అని తన రిటైర్మెంట్ కు కారణం ఇదేనని చెప్పాడు.
ALSO READ : క్రికెట్‌కు మించిన విషాదం: ఇజ్రాయెల్ దాడిలో పాలస్తీనా నంబర్-1 ఫుట్‌బాల్ ప్లేయర్ మృతి..
అప్పుడు కోహ్లీ చెప్పిన మాటలు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ప్రస్తుతం విరాట్ పూర్తిగా తెల్ల గడ్డంతోనే ఉన్నాడు. వరల్డ్ నెంబర్ వన్ ఫిట్ నెస్ క్రికెట్ ప్లేయర్ అయినప్పటికీ చూడడానికి ఓల్డ్ గెటప్ లో కనిపిస్తున్నాడు. 36 ఏళ్ళ కోహ్లీ టీ20, టెస్ట్ క్రికెట్ కు ఇప్పటికే తన రిటైర్మెంట్ ప్రకటించాడు. 2027 వన్డే వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఏడాది టెస్ట్ లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ.. ఇండియా తరఫున 123 టెస్టులు ఆడి 9230 రన్స్ చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 ఫిఫ్టీలు ఉన్నాయి. గత ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు.
Virat Kohli with Shash Kiran in the UK. pic.twitter.com/Y9JoWrO1Gl
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 8, 2025