గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రభుత్వ విమానం ఇవ్వని ‘మహా’ సర్కారు

గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రభుత్వ విమానం ఇవ్వని ‘మహా’ సర్కారు

రెండు గంటలు వెయిట్ చేసి
వేరే ఫ్లైట్‌‌‌‌‌‌‌‌లో వెళ్లిన కోషియారీ

ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌‌‌‌‌‌‌‌ థాక్రే, గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోషియారీ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రభుత్వ విమానంలో ట్రావెల్‌‌‌‌‌‌‌‌ చేయడానికి పర్మిషన్ ఇవ్వకుండా ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌లో రెండు గంటలు వెయిట్‌‌‌‌‌‌‌‌ చేయించింది. గవర్నర్ కోషియారీ డెహ్రాడూన్ పర్యటనకు వెళ్లడానికి రెడీ అయ్యారు. గురువారం ఉదయం 10 గంటలకు ముంబై ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టుకు చేరుకున్నారు. ప్రభుత్వ ఫ్లైట్‌‌‌‌‌‌‌‌లో ట్రావెల్‌‌‌‌‌‌‌‌ చేయడానికి సర్కారు నుంచి పర్మిషన్ రాకపోవడంతో రెండు గంటలపాటు ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌లోనే ఉండిపోయారు. అప్పటికీ పర్మిషన్‌‌‌‌‌‌‌‌ రాకపోవడంతో కమర్షియల్‌‌‌‌‌‌‌‌ ఫ్లైట్‌‌‌‌‌‌‌‌లో డెహ్రాడూన్‌‌‌‌‌‌‌‌కు వెళ్లిపోయారు. గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెహ్రాడూన్‌‌‌‌‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లనున్నట్టు ప్రభుత్వానికి ముందుగానే ఇన్ఫర్మేషన్‌‌‌‌‌‌‌‌ ఇచ్చామని, అయినా సర్కారు వ్యవహరించిన తీరు ఏమాత్రం బాగాలేదని గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ అధికారులు మండిపడ్డారు. పర్సనల్‌‌‌‌‌‌‌‌ ప్రోగ్రామ్స్‌‌‌‌‌‌‌‌లో పాల్గొనడానికి ప్రభుత్వ విమానాలను వాడుకోవడం సరికాదని శివసేన ఎంపీ వినాయక్‌‌‌‌‌‌‌‌ రౌత్‌‌‌‌‌‌‌‌ అభిప్రాయపడ్డారు. ఫ్లైట్‌‌‌‌‌‌‌‌ను ఉపయోగించేందుకు గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్మిషన్ తీసుకోలేదని, అందుకే పంపించలేదని చెప్పారు.