న్యూఇయర్ జోష్: కిటకిటలాడుతున్న వైన్స్, బార్లు, పబ్బులు

న్యూఇయర్ జోష్:   కిటకిటలాడుతున్న వైన్స్, బార్లు, పబ్బులు

కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు అంతా సిద్ధమైంది. న్యూఇయర్ సంబురాలతో రికార్డు స్థాయిలో లిక్కర్ అమ్ముడవుతోంది. ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్, ఆంక్షలతో సెలబ్రేషన్స్  చేసుకోవాలని సూచించింది పోలీస్ శాఖ. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో మరిన్ని ఆంక్షలు పెట్టారు పోలీసులు. రేపు ఉదయం వరకు సిటీలోని ప్లై ఓవర్లను బంద్ చేశారు. రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది పోలీస్ శాఖ.


రాష్ట్రంలో కొత్త ఏడాది సంబురాలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. వైన్స్, బార్లు, పబ్బులు కిటకిటలాడుతున్నాయి. కొన్ని ఏరియాల్లో స్పెషల్ ఈవెంట్స్ ఏర్పాటు చేశారు.  స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు కస్టమర్లలో కళకళలాడుతున్నాయి. మరోవైపు ఉదయం నుంచే మద్యం దుకాణాల్లో రద్దీ కనిపించింది. మద్యం సేల్స్ ఈ ఏడాది రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక్క డిసెంబర్ నెలలోనే భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ ఫస్ట్ నుంచి ఇవాల్టి వరకు 3 వేల 350 కోట్ల రూపాయల మద్యం అమ్ముడైంది. డిసెంబర్ 31 సాయంత్రం 5 గంటల వరకు 40 లక్షల కేసుల లిక్కర్ అమ్మకాలు జరిగాయని అధికారులు తెలిపారు. ఈ ఏడేళ్లలో మద్యం అమ్మకాల్లో ఇదే రికార్డని అంటున్నారు. రాష్ట్రంలో 2 వేల 620 వైన్స్ షాపులుంటే.... వెయ్యి బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. మామూలుగా నెలకు 28 లక్షల లిక్కర్ కేసుల అమ్మకాలు జరుగుతాయి. డిసెంబర్ లో మాత్రం 40 లక్షల కేసుల అమ్మకాలు జరిగాయి. ఇక ఈ నెలలో 34 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి.

కొత్త ఏడాది సెలబ్రషన్స్ పై  కండిషన్స్ అప్లై  అంటున్నారు  పోలీసులు. ఎంజాయ్ పేరుతో  ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు. కరోనా రూల్స్  పాటించాల్సిందేనని చెప్పారు. మద్యం తాగి  వాహనాలు నడిపినా.. రోడ్ల  మీదకు వచ్చి న్యూసెన్స్  చేస్తే  చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాత్రి వంద స్పెషల్ టీమ్ లతో  డ్రంకెన్ డ్రైవ్ చేపడుతున్నారు. డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడితే  భారీగా జరిమానా, జైలుశిక్ష  ఉంటుందన్నారు.  రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు.. బేగంపేట,  పీవీ ఎక్స్ ప్రెస్ హైవే  తప్ప  అన్ని  ఫ్లై ఓవర్లు బంద్ పెడుతున్నారు.

కరోనా గైడ్ లైన్స్,  ప్రభుత్వ ఆంక్షలతో లిమిటెడ్ మెంబర్స్ తో  ఈవెంట్స్ నిర్వహించుకోవాలని చెప్పారు పోలీసులు. ఈవెంట్లలో డీజేలకు అనుమతి  లేదని.. పబ్ లు, రెస్టారెంట్లు  భౌతికదూరం పాటించేలా ఈవెంట్లు నిర్వహించాలని చెప్పారు పోలీసులు.  జనాలను ఇబ్బంది పెట్టొద్దని..  స్థానికుల నుంచి ఫిర్యాదులు  వస్తే కఠిన  చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు. కరోనా రూల్స్ అతిక్రమించినా, మాస్క్ ధరించకుండా  దొరికినా చర్యలు  తప్పన్నారు. మొత్తానికి సిటీలో ఒమిక్రాన్ టెన్షన్, పోలీసుల ఆంక్షలతో పరిమిత సంఖ్యలోనే స్పెషల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి.