నిమ్స్ హాస్పిటల్​లో కొనసాగుతున్న స్టాఫ్ నర్సుల ఆందోళన

నిమ్స్ హాస్పిటల్​లో కొనసాగుతున్న  స్టాఫ్ నర్సుల ఆందోళన

ఖైరతాబాద్, వెలుగు: ఈపీఎఫ్​​ను నిమ్స్​పెన్షన్​కు కన్వర్ట్ చేయాలంటూ ఆ హాస్పిటల్ స్టాఫ్ నర్సులు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. బుధవారం సైతం ఎస్సీ,ఎస్టీ నర్సు యూనియన్, నిమ్స్ నర్సు యూనియన్, పారామెడికల్ యూనియన్, తెలంగాణ నర్సు అసోసియేషన్ల ఆధ్వర్యంలో లంచ్ టైమ్​లో నిరసన చేపట్టారు. నిమ్స్ పారా మెడికల్ యూనియన్  ప్రెసిడెంట్ శాంతి  మాట్లాడుతూ.. ఈపీఎఫ్​తో తాము నష్టపోతున్నామన్నారు. సీఎం కేసీఆర్ తమ ఆవేదనను అర్థం చేసుకుని నిమ్స్ పెన్షన్ స్కీమ్ కు కన్వర్ట్ చేయాలని కోరారు.