ఐపీఎల్ లో ఆరంభ మ్యాచ్ అదిరింది.. బోణీ కొట్టిన చెన్నై

ఐపీఎల్ లో ఆరంభ మ్యాచ్ అదిరింది.. బోణీ కొట్టిన చెన్నై

మన రాయుడు గెలిపించిండు

ఐపీఎల్ పదమూడో సీజన్ కు పర్ ఫెక్ట్ బిగినింగ్. ఫస్ట్ ఫైటే ఫ్యాన్స్ కు కిక్కిచ్చింది. హైదరాబాదీ అంబటి రాయుడు (48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 71) అదిరిపోయే బ్యాటింగ్ చేయడంతో శనివారం రాత్రి అబుదాబిలో ఉత్కంఠగా సాగిన తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ను ఓడించింది.

ఐపీఎల్ ఓపెనింగ్​ మ్యాచ్​ గ్రాండ్​ సక్సెస్ అయ్యిం ది..! ఫేవరెట్​గా దిగిన డిఫెండింగ్​ చాంపియన్ ముంబై ఇండియన్స్ కు షాకిస్తూ… చెన్నై సూపర్ కింగ్స్ బోణీ చేసింది..! హైదరాబాదీ అంబటి రాయుడు (48 బాల్స్ లో 71, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) రఫ్ఫాడించిన వేళ.. డుప్లెసిస్ (44 బాల్స్ లో 58 నాటౌట్​, 6 ఫోర్లు) అండగా నిలవడంతో… భారీ టార్గెట్​ను ఛేజ్​ చేసింది..! స్లో స్టార్టర్ గా పేరున్న ముంబై బ్యాటింగ్​, బౌలింగ్​లోనూ తేలిపోయింది..! ఓవరాల్ గా ఫ్యాన్స్ లేకపోయినా .. హంగామా లేకపోయినా .. ఇంటెన్సిటీలో ఏమాత్రం తేడా లేకుండా సాగిన మ్యాచ్​.. టీవీ ప్రేక్షకులను కట్టిపడేసింది..!

అబుదాబి: అనుభవంతో కూడిన ఆటతో చెలరేగిన చెన్నై సూపర్ కింగ్స్ .. ఐపీఎల్ –13 ఫస్ట్‌ ఫైట్ ముంబైకి చెక్ పెట్టింది. ఆల్ రౌండ్ షోతో అదరగొడుతూ.. శనివారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి చెన్నై ఫీల్డింగ్ ఎంచుకోగా.. ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లకు 162 రన్స్ చేసింది. సౌరభ్ తివారి (31 బాల్స్ లో 42, 3 ఫోర్లు, 1 సిక్స్ ), డికాక్ (20 బాల్స్ లో 33, 5 ఫోర్లు) మినహా మిగతా వారు నిరాశపర్చారు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన చెన్నై 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 166 రన్స్ చేసింది. చివర్లో సామ్ కరన్ (6 బాల్స్ లో 18, 1 ఫోర్ , 2 సిక్సర్లు) వేగంగా ఆడాడు. రాయుడికే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ’ అవార్డు లభించింది.

సౌరభ్ ఒక్కడే…

స్లో పిచ్ పై బ్యాటింగ్ కు దిగిన ముంబైకి తొలి నాలుగు ఓవర్లలో అదిరిపోయే ఆరంభం దక్కింది. ఎదుర్కొన్న ఫస్ట్​ బాల్ ను బౌండరీకి తరలించిన రోహిత్ (12) … ఐపీఎల్ ను ఘనంగా మొదలుపెట్టాడు. రెండో ఎండ్ లో డికాక్ కూడా దీటుగా స్పందించడంతో ఓవర్ కు 11కి పైగా రన్ రేట్ తో 45 రన్స్ వచ్చాయి. కానీ ఐదో ఓవర్ లో ఛేంజ్ బౌలర్ గా వచ్చిన పీయూష్ చావ్లా (1/21).. రోహిత్ ను దెబ్బకొట్టాడు. ఆఫ్ స్టంప్ మీదుగా వేసిన ఫుల్ లెంగ్త్ బాల్ ను లాఫ్ట్​ చేయబోయి హిట్ మ్యాన్ మిడాఫ్ లో కరన్ కు చిక్కా డు. తర్వాతి ఓవర్ లో కరన్ .. డికాక్ ను వెనక్కి పంపడంతో ముంబై 48 రన్స్ కే రెండు వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లే ముగిసేసరికి ఆ జట్టు స్కోరు 51/2. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్ (17), సౌరభ్ తివారి నిలకడగా ఆడారు. ఓవర్ కు ఓ బౌండరీ చొప్పున బాదారు. 9వ ఓవర్ లో జడేజా బాల్ ను లాంగాన్ లో సూపర్ సిక్సర్ గా మల్చిన తివారి 15 రన్స్ రాబట్టాడు. ఓవరాల్ గా తొలి 10 ఓవర్లలో ముంబై 86/2 స్కోరు చేసింది. అయితే11వ ఓవర్ లో చెన్నైకి మరో బ్రేక్ లభించింది. దీపక్ చహర్ బాల్ ను లాంగాన్ లోకి లేపిన సూర్యకుమార్ .. కరన్ కు క్యాచ్ ఇవ్వడంతో మూడో వికెట్ కు 44 రన్స్ పార్ట్​నర్ షిప్ బ్రేక్ అయ్యింది. హార్దిక్ (14) వచ్చీ రావడంతోనే రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. ముంబై స్కోరు 100 దాటింది. అయితే,15వ ఓవర్ లో జడేజా డబుల్ మ్యాజిక్ చేశాడు. ఫస్ట్​బాల్ కు తివారిని, ఐదో బాల్ కు హార్దిక్ ను ఔట్ చేశాడు. ఈ రెండు క్యాచ్ లు లాంగాన్ లో డుప్లెసి స్ సూపర్బ్​గా అందుకున్నాడు. దీంతో 124 రన్స్ కు సగం టీమ్ పెవిలియన్ కు చేరుకుంది. భారీ అంచనాలతో వచ్చిన పొలార్డ్​ (18), కృనాల్ (3) , ప్యాటిన్సన్ (11), బౌల్ట్​ (0) పూర్తిగా నిరాశపర్చారు. ఎంగిడి (3/38) వరుస విరామాల్లో మూడు వికెట్లు తీసి ముంబై స్కోరు కు కళ్లెం వేశాడు. దీం తో 14 ఓవర్లలో 121/3 ఉన్న ముంబై లాస్ట్​ 6 ఓవర్లలో 6 వికెట్లకు 41 రన్స్ మాత్రమే చేసింది.

అంబటి, డుప్లెసిస్ జోరు..

టార్గెట్ ఛేజింగ్ లో చెన్నైకి మెరుగైన ఆరంభం దక్కలేదు. టీమ్ 6 రన్స్ కు చేరేవరకే … ఆరు బంతుల తేడాలో వాట్సన్ (4), మురళీ విజయ్ (1) పె విలియన్ కు చేరారు. దీం తో ఇన్నింగ్స్ ను నిలబెట్టే బాధ్యత డుప్లెసిస్, రాయుడుపై పడింది. నాలుగో ఓవర్ లో ఫోర్ తో టచ్ లోకి వచ్చిన రాయుడు.. సింగిల్స్ కోసం వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తాడు. డుప్లెసిస్ కూడా బాగా స్పందించాడు. ఆరో ఓవర్ లో బుమ్రా బాల్ ను రాయుడు లాంగాన్ లో సిక్సర్ బాదాడు. స్పిన్నర్లు రాహుల్ , కృనాల్ … మిడిల్ ఓవర్లలో రన్స్ కొద్దిగా కంట్రోలు చేశారు. పదో ఓవర్ లో రెండు ఫోర్లు కొట్టిన రాయుడు టీమ్ స్కోరును 70/2కు పెంచా డు. అయితే 11వ ఓవర్ లో క్రునాల్ బాల్ ను స్టాం డ్స్ లోకి పంపిన రాయుడు.. బుమ్రా బాల్ ను స్ట్రయిట్ గా బౌండరీకి పంపి హాఫ్ సెంచరీ (33బాల్స్ లో ) పూర్తి చేశాడు. ఆ వెంటనే మరో సిక్సర్ తో రెచ్చి పోయాడు. 14వ ఓవర్ లో చెన్నై 100 రన్స్ కు చేరింది. వీలైనప్పుడల్లా ఫోర్లతో ఆకట్టుకున్న డుప్లెసిస్ కూడా రెండో ఎండ్ లో మంచి సహకారం ఇచ్చాడు. ఈ ఇద్దరి సమన్వయంతో చెన్నై 15 ఓవర్లలో 114/2 స్కోరు తో ఉంది. చివరి 5 ఓవర్లలో 30 రన్స్ కావాల్సిన దశలో రాయుడు లైన్ తప్పాడు. 16వ ఓవర్ లాస్ట్​ బాల్ ను బ్యాక్ వర్డ్​ పాయింట్ దిశగా ఆడే ప్రయత్నం చేయగా లైన్ మిస్సయి గాల్లోకి లేచింది. బౌలర్ చహర్‌‌ రిటర్న్‌ క్యాచ్‌ పట్టాడు. దీంతో మూడో వికెట్ కు 115 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. డుప్లెసిస్ తో జతకలిసిన జడేజా (10) చకచకా ఫోర్లు బాదాడు. కానీ 18వ ఓవర్ తొలి బంతికే ఔట్ కావడంతో చెన్నై టార్గెట్ చివరి 17 బాల్స్ లో 29గా మారింది. ఈ టైమ్ లో సామ్ కరన్ (18) ఓ సిక్స్, ఫోర్ బాది ఒత్తిడిని తగ్గించాడు. చివరి 12 బాల్స్ లో 16 పరుగులు అవసరం కాగా… కరన్ ఔటయ్యాడు. ధోనీ (0 నాటౌట్ ) రెండు బాల్స్‌ వేస్ట్‌ చేసినా డుప్లెసి స్ లాస్ట్‌ ఓవర్లో రెండు ఫోర్లతో లాంఛనం పూర్తి చేశాడు.

స్కోరు బోర్డు

ముంబై ఇండియన్స్ : రోహిత్ (సి) కరన్ (బి) చావ్లా 12, డికాక్ (సి) వాట్సన్ (బి) కరన్ 33, సూర్యకుమార్ (సి) కరన్ (బి) దీపక్ 17, సౌరభ్ తివారి (సి) డుప్లెసి స్ (బి) జడేజా 42, హార్దిక్ (సి) డుప్లెసి స్ (బి) జడేజా 14, పొలార్డ్​ (సి) ధోనీ (బి) ఎంగిడి 18, కృనాల్ (సి) ధోనీ (బి) ఎంగిడి 3, ప్యాటిన్సన్ (సి) డుప్లెసిస్ (బి) ఎంగిడి 11, రాహుల్ చహర్ (నాటౌట్ ) 2, బౌల్ట్​ (బి) చహర్ 0, బుమ్రా (నాటౌట్) 5, ఎక్స్ ట్రాలు: 5, మొత్తం : 20 ఓవర్లలో 162/9. వికెట్ల పత నం: 1–46, 2–48, 3–92, 4–121, 5 –1 24, 6–136, 7–151, 8–156, 9–156; బౌలింగ్​: దీపక్ చహర్ 4–0–32–2 , సామ్ కరన్ 4–0–28–1, ఎంగిడి 4 – 0 –38– 3, పీయూష్ చావ్లా 4–0–21–1, జడేజా 4–0–42–2.

చెన్నై సూపర్ కింగ్స్ : విజయ్ (ఎల్బీ) ప్యాటిన్సన్ 1, వాట్సన్ (ఎల్బీ) బౌల్ట్​ 4, డుప్లెసిస్ (నాటౌట్ ) 58, రాయుడు (సి అండ్ బి) చాహర్ 71, జడేజా (ఎల్బీ) కృనాల్ 10, కరన్ (సి) ప్యాటిన్సన్ (బి) బుమ్రా 18. ధోనీ (నాటౌట్ ) 0, ఎక్స్ ట్రాలు: 4, మొత్తం : 19.2 ఓవర్లలో 166/5;

వికెట్ల పతనం: 1–5, 2–6, 3–121, 4 – 134, 5–153; బౌలింగ్: బౌల్ట్​ 3.2–0–23–1, ప్యాటిన్సన్ 4–0–27–1, బుమ్రా 4–0–43–1, కృనాల్ 4–0–37–1, రాహుల్ చహర్ 4–0–36–1.

ఫ్యాన్స్‌‌ లేకున్నా .. గోల గోల

ఇరవై వేల సీటింగ్‌ సామర్థ్యం ఉన్న షేక్‌‌ జాయెద్‌ స్టేడియం దాదాపుగా ఎమ్టీగానే కనిపించింది. 22 మంది ప్లేయర్లు, అంపైర్లు, అఫీషియల్స్‌‌, సపోర్ట్‌‌ స్టాఫ్‌‌, సెక్యూరిటీ సిబ్బంది తప్పితే స్టేడియంలో ఎవరూ లేరు. అయినా ఫస్ట్‌‌ మ్యాచ్‌ టైమ్‌‌లో అరుపులు, కేకలతో స్టేడియం దద్దరిల్లింది. ముందుగానే రికార్డు చేసిన ఫ్యాన్స్‌‌ చీర్స్‌‌ను ఆట సందర్భంగా లౌడ్‌ స్పీకర్లలో ప్లే చేసిన ఆర్గనైజర్స్‌‌ స్టేడియంలో సైలెన్స్‌‌ తొలగించారు. ప్లేయర్లు ఫోర్లు, సిక్సర్లు కొట్టినప్పుడు, వికెట్లు తీసినప్పుడు ఫ్యాన్స్‌‌ అరుపులు వినిపించేలా చేసి వారిని ఉత్సాహపరిచారు. అలాగే, స్టేడియంలోని స్క్రీన్లపై చీర్‌‌‌‌గాళ్స్‌‌ డ్యాన్స్‌‌ కూడా చూపించారు. అలాగే, టెక్నాలజీని ఉపయోగించి ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో టీవీల ముందు కూర్చున్న ఫ్యాన్స్‌‌ను కూడా స్ర్కీన్లపై చూపించారు. దాంతో, ఆటగాళ్లకు ఎమ్టీ స్టేడియాల్లో ఆడుతున్న ఫీలింగ్‌ లేకుండా చేశారు.

తొలి పోరు ఆలస్యంగా..

ఐపీఎల్‌‌‌‌ ఫస్ట్‌‌‌‌ మ్యాచ్‌ ఆలస్యంగా మొదలైంది. షెడ్యూల్‌‌‌‌ ప్రకారం 7.30 గంటలకు బంతి పడాల్సి ఉండగా.. ఏడు నిమిషాలు లేట్‌ గా అంటే 7.42కి ఆట షురూ అయింది. బీసీసీఐ ప్రెసిడెంట్‌ సౌరవ్‌ గంగూలీ అండ్‌ కో, ఐపీఎల్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ బ్రిజేష్‌ పటేల్‌‌‌‌ సమక్షంలో అరబ్‌ ఎమిరేట్స్‌‌‌‌ బోర్డు చైర్మన్‌‌‌‌  షేక్‌‌‌‌ నహ్యన్ బిన్‌‌‌‌ టోర్నీని ఇనాగరేట్‌ చేశారు. ఆయన వెల్‌‌‌‌కమ్‌‌‌‌ స్పీచ్‌ ముగిసేటప్పటికి7.28 కాగా.. సైట్‌ స్క్రీన్‌‌‌‌ ప్రాబ్లమ్‌‌‌‌తో ఆట మరికాస్త ఆలస్యమైంది. క్రీజులోకి వచ్చిన రోహిత్‌‌‌‌ సూచన మేరకు సిబ్బంది సైట్‌ స్క్రీన్‌‌‌‌ సరిచేశారు. ఇక, మ్యాచ్‌ కు ముందు క్రికెటర్లు, అఫీషియల్స్‌‌‌‌, బీసీసీఐ, అరబ్‌ క్రికెట్‌ బోర్డు అధికారులు.. కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్‌ లైన్‌‌‌‌ వారియర్స్‌‌‌‌కు సంఘీభావం ప్రకటించారు. ‘థ్యాంక్యూ ఫ్రంట్‌ లైన్‌‌‌‌ వారియర్స్‌’అనే మెసేజ్‌ స్టేడియంలోని స్ర్కీన్లపై కనిపించింది.