పోలీసుల అదుపులో గన్తో హల్చల్ చేసిన కాంట్రాక్టర్

పోలీసుల అదుపులో గన్తో హల్చల్ చేసిన కాంట్రాక్టర్

దగ్గుబాటి సురేష్ బాబు భూమి వద్ద కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ గన్తో హల్చల్ చేసిన కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. దగ్గుబాటి సురేష్ బాబుకు రామకృష్ణారెడ్డికి మధ్య కొన్నాళ్లుగా భూవివాదం నడుస్తోంది. సంజీవ రెడ్డి ఆ భూమిలో కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు. తన భూమిలోకి జరిగి కన్స్ట్రక్షన్ చేస్తున్నారని రామకృష్ణారెడ్డి అనడంతో వివాదం మొదలైంది. 

ఈ నేపథ్యంలో రామకృష్ణారెడ్డికి సంజీవరెడ్డికి వాగ్వాదం జరిగింది.తన గన్ తీసి రామకృష్ణారెడ్డిని సంజీవ రెడ్డి బెదిరించాడు. దీంతో రామకృష్ణారెడ్డి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంజీవరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.