నిర్మల్ వెళ్తున్న బండి సంజయ్ను అడ్డుకున్న పోలీసులు

నిర్మల్ వెళ్తున్న బండి సంజయ్ను అడ్డుకున్న పోలీసులు

నిర్మల్​ జిల్లా భైంసాకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను జగిత్యాల దాటిన తర్వాత పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలిపి సంజయ్ ను అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  రేపటి నుంచి మొదలుకానున్న పాదయాత్ర కోసం ఆయన భైంసాకు వెళ్తున్నారు. పాదయాత్ర సహా ప్రారంభ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

భైంసా సున్నితమైన ప్రాంతం కాబట్టి యాత్రతో పాటు.. బహిరంగసభకు అనుమతి ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. రేపు జరిగే సభ కోసం ఇప్పటికే బీజేపీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. చివరి నిమిషంలో పర్మిషన్ లేదని చెప్పడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.