కాళేశ్వరం పై డ్యాం సేఫ్టీ వింగ్ ఇచ్చిన రిపోర్టును గత ప్రభుత్వం దాచింది : సీఎం రేవంత్ రెడ్డి

కాళేశ్వరం పై డ్యాం సేఫ్టీ వింగ్ ఇచ్చిన రిపోర్టును గత ప్రభుత్వం దాచింది : సీఎం రేవంత్ రెడ్డి

 కాకా సూచన మేరకు అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల  ప్రాజెక్టు ప్రతిపాదన చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. రీ డిజైన్ అనే బ్రహ్మపదార్దం ను బీఆర్ఎస్ కనిపెట్టిందని విమర్శించారు. వాఘా బార్డర్ మాదిరిగా పోలీసు సెక్యూరిటీ, పిట్ట కూడా ఎగరడానికి వీలు లేకుండా ఎవరూ చూడకుండా కాళేశ్వరాన్ని దాచారని దీనిపై కేంద్రానికి ఫిర్యాదులు అందితే డ్యాంసేఫ్టీ వింగ్ ను పంపించందని తెలిపారు. డ్యాం సేఫ్టీ పై నివేదిక వచ్చిందని కానీ దానిని గత ప్రభుత్వం దాచిందని అన్నారు. ఆఫీసులలో ఫైళ్లను మాయం చేశారని నివేదికలు వచ్చాయి. 

దీనిపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయించామని వాళ్ల పరిశీలించి ఒక నివేదిక ఇచ్చారన్నారు.  అక్కడ ఏం జరిగిందో చూడాల్సిన బాధ్యత ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మీద ఉందని అన్నారు. రేపో, ఎల్లుండో సాగునీటిపారుదల శాఖ మంత్రి శ్వేతపత్రం ప్రవేశపెట్టబోతున్నారని చెప్పారు. ఆరోజు సభ్యలందరికీ అవగాహన ఉండాలనే ఈ సందర్శన కార్యక్రమాన్ని తీసుకున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. 

హెలికాప్టర్ రెడీగా ఉంది..కేసీఆర్ రావాలి..

 కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు ప్రతిపక్ష నేత కేసీఆర్ రావాలని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కోరారు. ఆ ప్రాజెక్టును సందర్శించి ఆయన సూచనలు ఇవ్వాలని అన్నారు. ఈ సభ ద్వారా ఓ మంచి సంప్రదాయానికి తెరతీద్దామని చెప్పారు. బై రోడ్డు బస్సులు పెట్టుకున్నామని బస్సుల్లో ప్రయాణానికి ఇబ్బంది అనుకుంటే బేగంపేట విమానాశ్రయంలో ప్రభుత్వ హెలికాప్టర్ రెడీ ఉందని.. కేసీఆర్ ను తీసుకెళ్తామని అన్నారు.

బీఆర్ఎస్ కు, మాజీ సీఎం కేసీఆర్ కి నా విజ్ఞప్తి..

  మ్యాన్ మెయిడ్ వండర్ ను, న్యూయార్క్ టైం, డిస్కవరీ చానల్స్ కూడా ప్రదర్శించాయని చెప్పారు. కేసీఆర్ కూడా ప్రజలందరికీ వివరించి చెప్తే బాగుంటదన్నారు. తాజ్ మహల్ అంత అద్భుతాన్ని అక్కడ ఆవిష్కరించారు కాబట్టి దానిని తమకు వీనుల విందుగా  చెప్తే బాగుంటుందన్నారు. కాళేశ్వరం ఏటీఎంగా మారింది.. మీ ఇంట్ల కనకవర్షం కురిసింది అని తాము అనదల్చుకోలేదని రేవంత్ రెడ్డి చెప్పారు. తప్పు జరిగిందా..? జరగలేదా..? దానికి విధించాల్సిన శిక్ష ఏందనేదని పై చర్చిద్దామని తెలిపారు. బాంబులు పెట్టి పేల్చారని, పోలీసు స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చారని  ఇసుక మీద కట్టిండ్రా లేదా అనేది ప్రజలు తెలుసుకోవాల్సి ఉందని అన్నారు.