హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి రోడ్డు కుంగిపోయింది. సైదాబాద్ పరిధి సంతోష్ నగర్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. మే 1వ తేదీన(ఇవాళ) కురిసిన వర్షానికి భారీగా వరద రావడంతో రోడ్డు కుంగిపోయింది. వెంటనే వాహనదారులు గమనించడంతో ప్రమాదం తప్పింది. డీఆర్ఎఫ్ బృందం వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. వాహనదారులను అప్రమత్తం చేశారు. సైదాబాద్, సంతోష్ నగర్, మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
సాయంత్రం పలు చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు పడ్డాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. అత్యధికంగా గాజులరామారాంలో 3.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. హయత్ నగర్,చంద్రయాన్ గుట్టలో 2.9 సెంటీమీటర్లు..మల్కాజ్ గిరిలో 2.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది
