హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల సంక్షిప్త వార్తలు

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల సంక్షిప్త వార్తలు

అడుగుకో గుంత... ప్రయాణించేదెట్లా?
షాద్​నగర్, వెలుగు: ​షాద్ నగర్ నుంచి కేశంపేట,ఆమనగల్ వెళ్లే రోడ్డు,  పరిగి వైపు వెళ్లే రోడ్లు  గుంతల మయంగా మారాయి. అడుగుకో గుంతతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  ఈ రోడ్డలో వెళ్లాలంలేనే జనం జంకుతున్నారు. చిన్నవర్షం పడ్డా గుంతల్లో నీళ్లు నిండి బురదగా మారుతోంది. దీనిపై అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు చెప్తున్నారు.  

ఐదో తరగతి బాలిక ఆత్మహత్య.. 

స్కూల్​కు వెళ్లడం ఇష్టం లేకపోవడమే కారణం!
సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్ మోండా మార్కెట్ పీఎస్ పరిధిలోని టకార బస్తీలో గురువారం విషాదం చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల బాలిక ఉరివేసుకుని చనిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టకార బస్తీలో నివసిస్తున్న గీత అనే మహిళ భర్త మూడేండ్ల కిందట చనిపోయాడు. ఆమెకు ఇద్దరు కూతుళ్లు సుదీక్ష(11), సమీక్ష(9), బాబు రికేశ్(3) ఉన్నారు. గీత ఇండ్లళ్ల పని
చేస్తూ పిల్లలను పోషిస్తోంది. సుదీక్ష, సమీక్షలను సికింద్రాబాద్ లోని ఓ స్కూల్ లో చదివిస్తోంది. 5వ తరగతి చదువుతున్న సమీక్ష 15రోజులుగా స్కూల్ కు వెళ్లడం లేదు.తల్లి మందలించడంతో తనకు స్కూల్ లో టీచర్లు ఏమీ చెప్పడం లేదని.. అందుకే వెళ్లనని చెప్పింది. బలవంతంగా బడికి పంపిస్తే చనిపోతానని బెదిరించింది. దాంతో గీత రెండ్రోజులు తను పనిచేసే చోటుకు సమీక్షను తీసుకెళ్లింది. అక్కడికి కూడా తాను రానని ఇంట్లోనే ఉండి తమ్ముడు రికేశ్​ ను చూసుకుంటానని సమీక్ష చెప్పింది. గురువారం ఉదయం పెద్ద కూతురు సుదీక్షను స్కూల్ కి పంపిన గీత.. సమీక్ష, రికేశ్ లు  రోడ్డుపైకి రాకుండా ఉండేందుకు వారిని ఇంట్లోనే పెట్టి తాళం వేసి పనికి వెళ్లింది. 11 గంటలకు రికేశ్​ ఏడుపు విన్న స్థానికులు కిటికీ తెరిచి చూడగా.. సమీక్ష ఫ్యాన్ కు ఉరేసుకుని కనిపించింది. తాళం తీసి లోపలికి వెళ్లి చూస్తే..  సమీక్ష అప్పటికే చనిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్​బాడీని  పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు డెడ్ బాడీని అందించారు. ఘటనపై కేసు ఫైల్ చేశామని ఇన్ స్పెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. తల్లి మళ్లీ స్కూల్ కు పంపిస్తోందేమోననే భయంతోనే చిన్నారి ఆత్మహత్యకు పాల్పడిందా..? లేక ఇతర కారణాలున్నాయా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. 


మూడేళ్లుగా సమస్యలను పట్టించుకోవట్లే.. 

శామీర్ పేట మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీల నిరసన
శామీర్ పేట, వెలుగు:  మూడేళ్లుగా సభలో సమస్యలు వివరిస్తున్నా కనీసం పట్టించు
కునే అధికారులు లేరని, అలాంటి అప్పుడు ఈ సమావేశాలు ఎందుకంటూ శామీర్ పేట మండల ఎంపీటీసీలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో గురువారం ఉదయం ప్రారంభమైన శామీర్​పేట మండల సర్వసభ్య సమావేశం కొద్దిసేపటికే  ముగిసింది.  ఎంపీపీ ఎల్లు
బాయి అధ్యక్షతన  సమావేశంలో నిర్వహించగా..  ప్రజా సమస్యలు ఎందుకు చులకన చేస్తున్నారని, జవాబుదారీతనం లేని సభ ఎందుకు? అంటూ ఎంపీటీసీ సాయిబాబా, బొమ్మరాజుపేట ఎంపీటీసీ ఇందిరా, మండల కో ఆప్షన్ సభ్యుడు ముజ్జి బుద్దిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ సైతం వారి వాదనతో ఏకీభవించారు. ప్రజా సమస్యలు తీర్చని సమావేశం తమకు ఎందుకంటూ వారు బయటకు వెళ్లిపోయారు. దీంతో  సభ కొద్దిసేపట్లోనే ముగిసిపోయింది. సమావేశంలో జడ్పీటీసీ అనిత, ఎంపీడీవో వాణి, వైస్ ఎంపీపీ సుజాత వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.

సంక్షేమ హాస్టళ్లలో మెస్ చార్జీలను పెంచాలె
బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్
ముషీరాబాద్, వెలుగు: సంక్షేమ హాస్టళ్ల మెస్ చార్జీలను పెంచాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్  డిమాండ్ చేశారు.  ప్రతి హాస్టల్ కు అదనంగా ముగ్గురు వర్కర్లను కేటాయించాలని కోరారు. హాస్టళ్ల సమస్యలపై గురువారం బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశంను కలిసి సంఘం నేతలు ఆయనకు వినతి పత్రం ఇచ్చారు.  ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ  2015లో పెంచిన మెస్ చార్జీలను  ఇంకా  కొనసాగించడం  దారుణమన్నారు. మెస్​ చార్జీలు సరిగా లేకపోవడం వల్లే  స్టూడెంట్లకు నాణ్యమైన భోజనం అందడం లేదన్నారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు గొడుగు మహేశ్​యాదవ్​ ఉన్నారు. 



గ్యాస్​ లీక్​ కాదు.. హత్యే

జీడిమెట్ల, వెలుగు: జీడిమెట్లలోని రాంరెడ్డినగర్​లో గత నెల 26న    జరిగిన సిలిండర్​ పేలుడు ఘటనలో చనిపోయిన ఇద్దరు కార్మికుల కేసును పోలీసులు హత్యగా తేల్చారు. నిందితుడిని అరెస్ట్​ చేశారు.   బాలానగర్​ ఏసీపీ గంగారాం,  సీఐ పవన్​తో కలిసి గురువారం మీడియా సమావే
శంలో వివరించారు. జార్ఖండ్​కు చెందిన బీరేందర్​ కుమార్​ సింగ్​  అక్కడి నుంచి 9 మంది కార్మికులను  పని కోసం జీడిమెట్లకు తెచ్చి  రాంరెడ్డినగర్​లోని ఓ బిల్డింగ్​లో  ఉంచాడు.   9 మందిలో ఐదుగురికి  మాత్రమే  పని దొరికింది. దీంతో తనకు పని  దొరకలేదని భువనేశ్వర్​ సింగ్​ బీరేందర్​తో గొడవ పడ్డాడు.  ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ పెద్దదైంది.  భువనేశ్వర్​ సింగ్​ కోపంతో బీరేందర్​ కుమార్​ సింగ్​ను కట్టెతో కొట్టగా.. అతను  కుప్పకూలాడు. పక్కనే ఉన్న ఇవాదత్​ అన్సారీ అడ్డుకునేందుకు ప్రయత్నించగా..  అతన్ని కూడా తలపై కట్టెతో కొట్టాడు.  ఇద్దరూ చనిపోయారని గుర్తించి   భయంతో తానుకూడా ఆత్మహత్య చేసుకోవాలని   గదిలో ఉన్న గ్యాస్​ సిలిండర్స్​ లీక్ ​చేసి నిప్పుపెట్టాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. 

అగ్నిప్రమాదం అనుకున్నారు..
ఇంట్లో గ్యాస్ ​సిలిండర్​ పేలి అగ్నిప్రమాదం జరిగిందని అందరూ భావించారు. కాని గదిలో  తలపై దెబ్బలతో ఇద్దరు చనిపోయి ఉండటంతో హత్యగా భావించిన పోలీసులు దర్యాప్తు చేప
ట్టారు. నిందితుడు భువనేశ్వర్​ వద్ద సెల్​ ఫోన్​ లేకపోవడంతో అతడి కోసం 3 టీంలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. జార్ఖండ్​లోని భువనేశ్వర్​ సింగ్​ ఊరికి సైతం వెళ్లారు. కాగా గురువారం సిటీలో తనకి తెలిసిన వారి దగ్గరికి వచ్చిన  భువనేశ్వర్​ సింగ్​ను పోలీసులు పట్టు
కుని అరెస్ట్​చేసి రిమాండ్​కి తరలించారు.  


పెద్దలు పెండ్లికి ఒప్పుకోరని ప్రేమ జంట ఆత్మహత్య
శంషాబాద్, వెలుగు: పెద్దలు పెండ్లికి ఒప్పుకోరని  ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన మైలార్ దేవ్ పల్లి పీఎస్ పరిధిలో జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ కు చెందిన రవి(20) తల్లితో కలిసి బతుకుదెరువు కోసం హైదరాబాద్​వచ్చాడు. మైలార్ దేవ్ పల్లి పీఎస్ పరిధి బుద్వేల్ గ్రామం నేతాజీనగర్ లో ఉంటున్నాడు. ఆటోడ్రైవర్ గా చేస్తున్న రవికి కొంతకాలం కిందట అదే ఏరియాలో ఉండే ఓ బాలిక(17)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. విషయం తెలుసుకున్న బాలిక తండ్రి రవిని ఒకసారి మందలించాడు. తర్వాత సొంతూరికి వెళ్లిన రవి రెండ్రోజుల కిందట మళ్లీ బుద్వేల్​లోని ఇంటికి వచ్చాడు. గురువారం ఉదయం తల్లి పనికి వెళ్లగానే రవి తాను ప్రేమించిన అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడు. పెద్దలు పెండ్లికి ఒప్పుకోరనే మనస్తాపంతో ఇద్దరూ ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకున్నారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న మైలార్ దేవ్ పల్లి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. డెడ్ బాడీలను ఉస్మానియాకు తరలించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్ స్పెక్టర్ నరసింహ తెలిపారు.

పేద జంటకు పెళ్లి
కొత్తపేటలోని  వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో మొగుళ్లపల్లి యువసేన ఆధ్వర్యంలో బుధవారం పేద జంటకు పెండ్లి చేశారు. తెలంగాణ ఆర్యవైశ్య మహా సభ నాయకుడు  మొగుళ్లపల్లి ఉపేందర్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ 203 పేద జంటలకు యువసేన ఆధ్వర్యంలో పెండ్లిళ్లు చేసినట్లు ఆయన తెలిపారు. - వెలుగు, ఎల్​బీనగర్

బ్యూటీషియన్​పై  అత్యాచారం
జీడిమెట్ల:  ఓ వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని గాజులరామారానికి చెందిన యువతి గురువారం జీడిమెట్ల పీఎస్​లో కంప్లయింట్ చేసింది. బ్యూటీషియన్​గా  పనిచేస్తున్న తనకు ఫ్రెండ్స్ ద్వారా సంజీవ రెడ్డి(55) అనే వ్యక్తి పరిచయమయ్యాడని ఆమె తెలిపింది. బుధవారం తన ఇంటికి వచ్చిన సంజీవ రెడ్డి బ్యూటీ పార్లర్ పెట్టిస్తానని ఆశ చూపి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె కంప్లయింట్​లో పేర్కొంది. బాధితురాలు ఇచ్చిన కంప్లయింట్ మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

18వ రోజుకు చేరిన వీఆర్ఏల సమ్మె
శంషాబాద్:  శంషాబాద్ తహసీల్దార్ ఆఫీసు ఎదుట వీఆర్ఏలు చేస్తున్న సమ్మె 18 రోజుకు చేరింది. గురువారం తహసీల్దార్ ఆఫీసు వద్ద వీఆర్ఏలు వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  తమ సమస్యలను పరిష్కరించడంలో  ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు కోరారు.

వరల్డ్​ పోలీస్‌‌ స్పోర్ట్స్​మీట్‌‌లో  సత్తా చాటిన రాచకొండ పోలీసులు
మల్కాజిగిరి: వరల్డ్​ పోలీస్‌‌ అండ్​ ఫైర్ ​గేమ్స్‌‌లో రాచకొండ పోలీసులు సత్తా చాటారు. పలు విభాగాల్లో  1 సిల్వర్​, 3  బ్రాంజ్​ మెడల్స్​నుసాధించారు.  నెదర్లాండ్స్​ రోటర్ ​డామ్‌‌లో గత నెల 22‌‌‌‌ -నుంచి 31వరకు ఈ పోటీలు జరిగాయి. టేబుల్​టెన్నిస్ ​సింగిల్స్, డబుల్స్, మిక్స్​డ్ ​డబుల్స్‌‌లో పాల్గొన్న రాచకొండ రోడ్ ​సేఫ్టీ విభాగం డీసీపీ శ్రీబాల సిల్వర్​, బ్రాంజ్​ మెడల్స్​ సాధించారు.  తైక్వాండోలో ఏఆర్​పీసీ ధుద్యాల సంజీవ్​కుమార్​ బ్రాంజ్​ మెడల్​ గెలుచుకున్నారు.  కాగా విజేతలను గురువారం సీపీ మహేశ్ ​భగవత్ సన్మానించారు. 

150 క్వింటాళ్ల రేషన్​ బియ్యం సీజ్
వికారాబాద్: పట్టణానికి చెందిన  టిప్పు సుల్తాన్ అనే  వ్యక్తి  నెహ్రు గంజ్ స‌‌మీపంలో రేష‌‌న్ బియ్యాన్ని పెద్ద ఎత్తున నిల్వ ఉంచాడు.  గురువారం  వాటిని క‌‌ర్ణాట‌‌కకు డీసీఎంలో  తరలిస్తుండగా..  వికారాబాద్  టాస్క్ ఫోర్స్ పోలీసులు  పట్టుకున్నారు. 300 బస్తాల్లో ఉన్న 150 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.  

‘గాంధీ’ సినిమా చూసిన స్టూడెంట్లు
ముషీరాబాద్: స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్  సంధ్య థియేటర్ లో ‘గాంధీ’ సినిమా చూసేందుకు గురువారం ఆర్టీసీప్రత్యేక బస్సులో పలు స్కూళ్ల నుంచి  స్టూడెంట్లు తరలివచ్చారు.

వరల్డ్​ పోలీస్‌‌ స్పోర్ట్స్​మీట్‌‌లో  సత్తా చాటిన రాచకొండ పోలీసులు
మల్కాజిగిరి: వరల్డ్​ పోలీస్‌‌ అండ్​ ఫైర్ ​గేమ్స్‌‌లో రాచకొండ పోలీసులు సత్తా చాటారు. పలు విభాగాల్లో  1 సిల్వర్​, 3  బ్రాంజ్​ మెడల్స్​నుసాధించారు.  నెదర్లాండ్స్​ రోటర్ ​డామ్‌‌లో గత నెల 22‌‌‌‌ -నుంచి 31వరకు ఈ పోటీలు జరిగాయి. టేబుల్​టెన్నిస్ ​సింగిల్స్, డబుల్స్, మిక్స్​డ్ ​డబుల్స్‌‌లో పాల్గొన్న రాచకొండ రోడ్ ​సేఫ్టీ విభాగం డీసీపీ శ్రీబాల సిల్వర్​, బ్రాంజ్​ మెడల్స్​ సాధించారు.  తైక్వాండోలో ఏఆర్​పీసీ ధుద్యాల సంజీవ్​కుమార్​ బ్రాంజ్​ మెడల్​ గెలుచుకున్నారు.  కాగా విజేతలను గురువారం సీపీ మహేశ్ ​భగవత్ సన్మానించారు.