APలో కొనసాగుతున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

APలో కొనసాగుతున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

APలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.  13 జిల్లాల్లోని  2 వేల 786 సర్పంచ్, 20 వేల 817 వార్డు సభ్యుల స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. పంచాయతీల్లో 7 వేల 510 మంది, వార్డుల్లో 44 వేల 879 మంది పోటీ పడుతున్నారు. ఉదయం ఆరున్నర నుంచి మధ్యాహ్నం మూడున్నర వరకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటించనున్నారు. ఉదయం నుంచే ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ సెంటర్స్ దగ్గర క్యూ కట్టారు.  కరోనా నేపధ్యంలో ప్రతి ఒక్కరు కరోనా రూల్స్ పాటించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

పోలింగ్ నిర్వహణ కోసం 85 వేల 416 మంది అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన 3 వేల 328 గ్రామ పంచాయతీల్లో 539 చోట్ల సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అయితే చివరి గంట టైం కరోనా సోకిన వారు ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు అధికారులు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు అధికారులు. ప్రతి మండలానికి ఒక డీఎస్పీని నియమించి భద్రతను పర్యావేక్షిస్తున్నారు. అతి సమస్యాత్మక గ్రామాల్లో SI, నలుగురు కానిస్టేబుల్స్ ను నియమించారు.