ఏపీలో ముగిసిన రెండో దశ పంచాయతీ పోలింగ్

ఏపీలో ముగిసిన రెండో దశ పంచాయతీ పోలింగ్

అమరావతి: ఏపీలో పంచాయతీ ఎన్నికల రెండో విడుత పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలో ఉన్న 167 మండలాల్లో ఇవాళ పోలింగ్ జరిగింది. 2,768 సర్పంచ్ స్థానాలకు, 20 వేల 817 వార్డు మెంబర్ల స్థానాలకు ఇవాళ ఎన్నికల పోలింగ్ జరిగింది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీసీ వర్గాల మధ్య పలుచోట్ల ఘర్షణలు, చెదురు మదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మొదటి దశలో మాదిరిగానే రెండో దశ పోలింగ్ సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కు ఉపయోగించుకునేందుకు బారులు తీరారు. మధ్యాహ్నం 3.30 వరకు క్యూలైన్ లో వేచి ఉన్న వారందరూ ఓటు హక్కు ఉపయోగించుకున్నారు.

13 జిల్లాల్లో 539 పంచాయతీలు ఏకగ్రీవం

రెండో దశ పోలింగ్ సందర్భంగా 13 జిల్లాల పరిధిలోని 167 మండలాల్లో ఉన్న 539 పంచాయతీ స్థానాలు ఏకగ్రీవం అయినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఏకగ్రీవాలు అయిన స్థానాలు పోగా మిగిలిన 2 వేల 786 పంచాయతీల్లో ఇవాళ పోలింగ్ జరిగింది. సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పోలీసు బలగాలను మొహరించడంతోపాటు.. పోలింగ్ కేంద్రాల చుట్టుపక్కల 144 సెక్షన్ విధించారు. ఫలితాలు ప్రకటించిన తర్వాత ఊరేగింపులు, విజయోత్సవాలు, బాణ సంచా కాల్చడంపై నిషేధం విధించడంతో ఆయా పార్టీల నేతలు, అభ్యర్థులు కూడా పరిమిత స్థాయిలో అభ్యంతరాలకు అవకాశం లేని రీతిలో సంబరాలు చేసుకుంటున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడుత పంచాయతీ పోలింగ్ శాతం వివరాలు

ఇవి కూడా చదవండి

ఏపీ ఎన్నికల సిబ్బందికి ఒక్కో జిల్లాలో ఒక్కో రెమ్యూనరేషన్

వీ6 చానెల్ డిబేట్‌పై స్పందించిన మంత్రి ఎర్రబెల్లి

వాహనదారులపై పెట్రో బాంబ్.. లీటర్ ధర 92కు చేరువ