ఆర్బీఐ నుంచి అప్పు కోసం రాష్ట్ర సర్కార్ రెడీ

ఆర్బీఐ నుంచి అప్పు కోసం రాష్ట్ర సర్కార్ రెడీ

హైదరాబాద్​, వెలుగు: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మరో భారీ అప్పుకు రాష్ట్ర సర్కార్​ రెడీ అయింది. రూ.2,500 కోట్ల కోసం ఇండెంట్ ​పెట్టింది. ఆగస్ట్ రెండో తేదీన ఈ మొత్తాన్ని బాండ్ల వేలంలో తీసుకోనుంది. దీంతో తెలంగాణ ఒక్క జులైలోనే తీసుకున్న అప్పు రూ.7,500 కోట్లు కానుంది. అంతకుముందు జూన్​నెలలో రాష్ట్ర సర్కారు రూ.7 వేల కోట్లు తీసుకున్నది. దీంతో రాష్ట్ర సర్కార్​ ఈ రెండు నెలల్లో ఆర్బీఐ దగ్గర చేసిన మొత్తం అప్పు రూ.14,500 కోట్లు అవు