ఖర్చులు తగ్గిద్దాం.. పొదుపు చర్యలపై రాష్ట్ర సర్కారు ఫోకస్.. ప్రధానంగా పెట్రోల్, డీజిల్, కరెంట్ ఆదాకు చర్యలు

ఖర్చులు తగ్గిద్దాం.. పొదుపు చర్యలపై రాష్ట్ర సర్కారు ఫోకస్.. ప్రధానంగా పెట్రోల్, డీజిల్, కరెంట్ ఆదాకు చర్యలు
  • తక్షణం.. దశల వారీగా చేపట్టాల్సిన కార్యాచరణపై ఆర్థిక నిపుణుల సలహాలు 
  • మే 21న జరగనున్న కేబినెట్ మీటింగ్​లో చర్చ
  •     ఇప్పటికే కాన్వాయ్​లో కార్లను 
  • తగ్గించుకున్న సీఎం రేవంత్​
  •     జూబ్లీహిల్స్​ నివాసం నుంచి ఎంసీహెచ్​ఆర్డీకి మూడు వాహనాల్లో ప్రయాణం
  •     మంత్రుల కాన్వాయ్​లోనూ 
  • వాహనాలు తగ్గించాలని ప్లాన్
  •     ఇంధన పొదుపు కోసం పబ్లిక్​ ముందుకు రావాలని గవర్నర్‌‌‌‌‌‌‌‌ శివ్‌‌‌‌ ప్రతాప్‌‌‌‌ శుక్లా పిలుపు 
  •     మోదీ సప్త సూత్రాలు రిలీజ్​ చేసిన 
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​ రావు

హైదరాబాద్​, వెలుగు: అమెరికా ఇరాన్​ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా తలెత్తుతున్న  పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోదీ ఇటీవల ప్రకటించిన పొదుపు చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్​ పెట్టింది. ప్రభుత్వపరంగా వృథా ఖర్చులను తగ్గిస్తూ, ప్రజాధనాన్ని అత్యంత పొదుపుగా 
వాడుకోవాలని  సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్, ప్రముఖ ఆర్థిక నిపుణుడు సుబ్రమణ్యం వంటి మేధావుల సలహాలను తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా తక్షణమే అమలు చేయాల్సిన చర్యలతో పాటు దశలవారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దృష్టిసారించారు.

 ఈ కార్యాచరణ అమలు కోసం ఉన్నతాధికారులతో ఓ టీమ్​ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ బృందం ఇతర రాష్ట్రాల్లో తీసుకుంటున్న పొదుపుచర్యలను కూడా పరిశీలిస్తూ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వనుంది.  ఈక్రమంలో సీఎం రేవంత్​రెడ్డి ఇప్పటికే తన అధికారిక కాన్వాయ్‌‌‌‌లోని వాహనాల సంఖ్యను గణనీయంగా  తగ్గించుకున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ నివాసం నుంచి ఎంసీహెచ్‌‌‌‌ఆర్‌‌‌‌డీకి కేవలం మూడు వాహనాలతో కూడిన కాన్వాయ్​లోనే  ప్రయాణించారు. ఇదే తరహాలో మంత్రుల కాన్వాయ్‌‌‌‌లను కూడా కుదించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.  అధికారులు కూడా వాహనాలు తగ్గించుకోవడంతోపాటు ప్రైవేట్, కార్పొరేట్ కంపెనీల్లోనూ పొదుపు చర్యలు అమలు చేసేలా కార్యాచరణ రెడీ అవుతోంది. 


అటు పబ్లిక్​ ట్రాన్స్​పోర్ట్ పెంచడం, ఈవీ వాహనా లు వాడడం, విదేశీ ప్రయాణాలు వాయిదా వేయ డం, పెద్ద మీటింగ్​లు, ఇతర ఆర్బాటాలకు వెళ్లకుండా సర్కార్ ఆఫీసుల్లోనే కాన్ఫరెన్స్​లు నిర్వహించడం, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల వాడ కం తగ్గించడం లాంటి చర్యకూ సర్కారు సిద్ధమవుతోంది. ఈమేరకు ఈ నెల 21న జరగనున్న కేబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.   

  • లగ్జరీ, వృథా ఖర్చులకు చెక్​ 

పొదుపు చర్యలో భాగంగా ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయాల్లో లగ్జరీ, వృథా ఖర్చులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కొత్త వాహనాల కొనుగోలుపై తాత్కాలిక నిషేధం విధించడంతో పాటు, మంత్రులు, అధికారుల కార్యాలయాల రీ-డెకరేషన్ ఖర్చులను పూర్తిగా నిలిపివేయాలని భావిస్తోంది. సమావేశాల కోసం ఫైవ్ స్టార్ హోటళ్లను వదిలి, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కాన్ఫరెన్స్ హాల్స్‌‌ను మాత్రమే వినియోగించుకోవాలని ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిసింది.  అధికారుల విదేశీ పర్యటనలను తగ్గించి, జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో జరిపే చర్చలను వర్చువల్ మోడ్‌‌లోకి మార్చడం ద్వారా   ప్రజాధనాన్ని ఆదా చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. సెక్రటేరియట్ నుంచి గ్రామ పంచాయతీల వరకు 'ఈ-ఆఫీస్' విధానాన్ని పకడ్బందీగా అమలు చేయబోతున్నారు. 

  • పల్లి, సన్​ప్లవర్​ సాగు పెంచడంపైనా ఫోకస్​.. 

దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే పాటిస్తున్న పొదుపు చర్యలను రాష్ట్రంలోనూ అమలుచేయడంపై దృష్టిసారించాలని సీఎం అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. యూపీలో మంత్రులు, ఉన్నతాధికారుల కాన్వాయ్‌‌ వెహికిల్స్​ను 50% తగ్గించడం, వర్క్ ఫ్రమ్ హోమ్  ను ఐటీ తరహాలో ఇతర శాఖలకు విస్తరించేలా  చర్యలు తీసుకోవడం తెలిసిందే.  

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్  'పెట్రోల్-ఫ్రీ సండేస్' నిబంధన  ప్రకటించారు. , విదేశీ ఇంధన సంక్షోభం తగ్గే వరకు ప్రభుత్వ హెలికాప్టర్ వాడనని ప్రతిజ్ఞ చేశారు. ఇలాంటి చర్యలు రాష్ట్రంలో అమలు చేస్తే ఇంధన ఆదాతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు. దీనికి అదనంగా, రాష్ట్రంలో వేరుశనగ, సన్​ ప్లవర్​, పామాయిల్​ సాగు పెంచడం ద్వారా దిగుమతుల భారం తగ్గుతుందని చెప్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పామాయిల్​ సాగును ప్రోత్సహిస్తున్న రాష్ట్ర సర్కారు.. మిగిలిన నూనెగింజల సాగును పెంచడంపైనా దృష్టిపెట్టాలని నిర్ణయించినట్లు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.

  • విద్యుత్​ వాడకం తగ్గించాలి..  

విద్యుత్ పొదుపు విషయంలోనూ  ప్రభుత్వం పకడ్బందీగా ప్లాన్​ చేస్తున్నది. ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు,  హాస్పిట ల్స్​, స్ట్రీట్ ​లైట్లకు వంద శాతం ఎల్‌‌ఈడీ బల్బులను అమర్చడంతో పాటు, తక్కువ విద్యుత్ వినియోగించే 5-స్టార్ రేటింగ్ పరికరాలనే వాడాలని ఆదేశాలు జారీ చేయనున్నట్టు తెలిసింది.  భవనా లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు, వర్షపు నీటి నిల్వ పద్ధతులు చేపట్టడం ద్వారా బిల్లుల ఖర్చును తగ్గించేలా చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు చెప్తు న్నారు. 

వారంలో ఒక రోజు 'నో వెహికల్ డే' పాటించాలని, తదుపరి ఆరు నెలల పాటు కొత్త వాహనాల కొనుగోలు ఉండ వని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అంతేకాకుండా, రాబోయే 3 నెలల పాటు భారీ కార్యక్రమాలను రద్దు చేసి, ఆ నిధులను అత్యవసర అవసరాలకు మళ్లించే యోచనలో సర్కార్ ఉంది.   రాష్ట్రంలో వారంలో ఒక రోజు ప్రజలంతా స్వచ్ఛందంగా 'నో వెహికల్ డే' పాటించా లని, ప్రభుత్వ ఆఫీసర్లు వారంలో కనీసం ఒక రోజు పబ్లిక్​ట్రాన్స్​పోర్ట్​ లేదా ఎలక్ట్రిక్ వాహనాల్లో మాత్రమే ప్రయాణించాలనే  ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.