షాబాద్ భూములకు కొనసాగుతున్న వేలం పాట

షాబాద్ భూములకు కొనసాగుతున్న వేలం పాట

కేసీఆర్ సర్కార్ రాష్ర్టంలోని భూములపై కన్నేసింది. వరుసగా భూములను అమ్ముతోంది. హైదరాబాద్ పరిసరాల్లో వరుసగా భూముల అమ్మకాలు చేపట్టింది. మొన్న కోకాపేట, నిన్న మోకిలా, ఇవాళ షాబాద్.. ఇలా వరుసగా భూములను అమ్ముతూ ఆదాయం సమకూర్చుకుంటోంది.

ఇటు హెచ్ఎండీఏ రియల్ ఎస్టేట్ సంస్థలా మారిందన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మంగళవారం (ఆగస్టు 8న) షాబాద్ భూములకు వేలం పాట కొనసాగుతోంది. గతంలోనూ వందలాది ఎకరాలు వేలం పెట్టింది తెలంగాణ సర్కార్. 

రంగారెడ్డి జిల్లాలోని మోకిలా భూముల వేలంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 121 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. 50 ప్లాట్లను హెచ్ఎండీఏ వేలం వేయగా 48 ప్లాట్లు అమ్ముడయ్యాయి. ప్లాట్ల అమ్మకం ద్వారా రూ.39 కోట్ల 50 లక్షలు వస్తాయని హెచ్ఎండీఏ అంచనా వేసింది. కానీ.. అంతకుమించి ఆదాయం వచ్చింది. రూ.121 కోట్ల 40 లక్షల ఆదాయం వచ్చింది. నార్సింగి శేరిలింగంపల్లికి 2 కిలోమీటర్ల సమీపంలో ఉన్న మోకిలా గ్రామంలో హెచ్ఎండీఏ మొత్తం 165 ఎకరాలను డెవలప్ చేసి వేలం నిర్వహించింది. 

గురువారం రోజు (ఆగస్టు 10న) బుద్వేల్ లోని భూములను హెచ్ఎండీఏ వేలానికి పెట్టింది. ఇటు కోకాపేట భూముల వేలంతో 3 వేల 300 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్రంలో వరుసగా భూముల అమ్మకాలు చేపడుతుండడంతో రాష్ర్ట ప్రభుత్వంపై విపక్షాలు మండిపడుతున్నాయి.