విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారా..? : టీఎస్‌పీఎస్సీపై హైకోర్టు ఆగ్రహం

విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారా..? :  టీఎస్‌పీఎస్సీపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్ : గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. గ్రూప్‌-1 రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో సవాల్‌ చేసింది. ఎన్నిసార్లు నిర్లక్ష్యం వహిస్తారంటూ టీఎస్‌పీఎస్సీపై హైకోర్టు ఆగ్రహం చేసింది. రూల్స్‌ మీరే ఉల్లంఘిస్తే ఎలా అంటూ మండిపడింది. ఒకసారి పేపర్‌ లీకేజీ, ఇప్పుడేమో బయోమెట్రిక్‌ సమస్య ఉందంటూ... విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారా..? అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ALSO READ : ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో ఏ14గా నారా లోకేష్

ఉద్యోగాలు రాక చాలామంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రాజ్యాంగబద్ధ వ్యవస్థ అయ్యి ఉండి పరీక్షల నిర్వహణలో పదేపదే టీఎస్‌పీఎస్సీ విఫలమవుతోందని పేర్కొంది. మొదటిసారి పేపర్ లీకేజీతో పరీక్ష రద్దు చేశారని, రెండోసారి నిర్వహించే సమయంలోనూ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రూప్ 1 రీ పరీక్షలో బయోమెట్రిక్ పెట్టకపోవడానికి కారణాలు ఏంటని ప్రశ్నించింది.