తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. 2024, ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయని తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు గురువారం (డిసెంబర్ 28న) వెల్లడించింది. మార్చి 18వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్  ఇయర్.. మార్చి 19వ తేదీ వరకు ఇంటర్ సెకండ్ ఈయర్ పరీక్షలు జరగనున్నాయి. 

ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు (జనరల్‌/వొకేషనల్‌ కోర్సులు) ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నారు.  రెండో శనివారం, ఆదివారాల్లోనూ ఈ పరీక్షలు జరుగుతాయని అధికారులు స్పష్టం చేశారు. 

రెండు సెషన్లలో ప్రాక్టికల్స్ జరుగుతాయని.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌ పరీక్షలు ఉంటాయి. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులకు ఇంగ్లీష్‌ ప్రాక్టికల్‌ పరీక్ష ఫిబ్రవరి 16న నిర్వహిస్తారు.

షెడ్యూల్‌ ఇది.. 

ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల తేదీలు :

28-02-2024 సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-I
01-03-2024 ఇంగ్లీష్‌ పేపర్‌-I
04-03-2024 మ్యాథమేటిక్స్‌ పేపర్‌-IA, బాటనీ పేపర్‌-I, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-I
06-03-2024 మ్యాథమేటిక్స్‌ పేపర్‌-IB, జువాలజీ పేపర్‌-I, హిస్టరీ పేపర్‌-I
11-03-2024 ఫిజిక్స్‌ పేపర్‌-I, ఎకనామిక్స్‌ పేపర్‌-I
13-03-2024 కెమిస్ట్రీ పేపర్‌-I, కామర్స్‌ పేపర్‌-I
15-03-2024 పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-I, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-I
18-03-2024 మోడర్న్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-I, జియోగ్రఫీ పేపర్‌-I

ఇంటర్‌ సెకండ్‌ పరీక్షల తేదీలు :

29-02-2024 సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-II
02-03-2024 ఇంగ్లీష్‌ పేపర్‌-II
05-03-2024 మ్యాథమేటిక్స్‌ పేపర్‌-IIA, బాటనీ పేపర్‌-II, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-II
07-03-2024 మ్యాథమేటిక్స్‌ పేపర్‌-IIB, జువాలజీ పేపర్‌-II, హిస్టరీ పేపర్‌-II
12-03-2024 ఫిజిక్స్‌ పేపర్‌-II, ఎకనామిక్స్‌ పేపర్‌-II
14-03-2024 కెమిస్ట్రీ పేపర్‌-II, కామర్స్‌ పేపర్‌-II
16-03-2024 పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-II, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-II
19-03-2024 మోడర్న్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-II, జియోగ్రఫీ పేపర్‌-II