మునుగోడులో భారీగా చీలిన ఓటు బ్యాంక్​

మునుగోడులో భారీగా చీలిన ఓటు బ్యాంక్​

హైదరాబాద్, వెలుగు: మునుగోడు బై ఎలక్షన్​లో రిజిస్టర్డ్​ పార్టీలు, ఇండిపెండెంట్​ అభ్యర్థులు 6 శాతం ఓట్లను సాధించారు. మొత్తం 47 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇందులో బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థులు మినహా, మిగిలిన 43 మంది క్యాండిడేట్లకు 14,119 ఓట్లు పోలయ్యాయి. దీంతో 2 ప్రధాన పార్టీల ఓట్లు భారీగా చీలాయనే చర్చ జరుగుతోంది. వీటిలో రోడ్డు రోలర్, రోటీ మేకర్​ అభ్యర్థులకు వరుసగా 2,407, 2272 ఓట్లు వచ్చాయి. మిగతా స్వతంత్ర అభ్యర్థులందరి కంటే వీరికే ఎక్కువగా వచ్చాయి. రిజిస్టర్డ్​ పార్టీల కంటే ఇండిపెండెంట్లకే 2 వేల ఓట్లు ఎక్కువగా వచ్చాయి.

మొత్తంగా 8,085 ఓట్లు ఇండిపెండెంట్లకు పోలయ్యాయి. ఈ ఓట్లు తమవే అంటూ టీఆర్ఎస్​, బీజేపీ అంటున్నాయి. ప్రచారంలో ఐకాన్​గా నిలిచిన ప్రజాశాంతి పార్టీ చీఫ్​ కేఏ పాల్​కు 805 ఓట్లు వచ్చాయి. టీజేఎస్​కు 170 ఓట్లు రాగా.. బీఎస్పీకి 4,146 ఓట్లు పోలయ్యాయి. ఇండిపెండెంట్​లకు ఈ స్థాయిలో ఓట్లు రావడానికి కారణం ఈసీనే అని బీజేపీ విమర్శిస్తోంది. తమ పార్టీ గుర్తును పోలిన సింబల్స్​ ను ఇండిపెండెంట్లకు కేటాయించడం వల్లే సమస్య వచ్చిందని టీఆర్​ఎస్​ఆరోపిస్తోంది.