
ఖమ్మం జిల్లా : కనిపించకుండా పోయిన యువతి ఆచూకీ ఇంకా లభించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. ఎర్రుపాలెం మండల పరిధిలోని, రేమిడిచర్ల గ్రామానికి చెందిన బాలిక రాజశ్రీ(16) అదృశ్యం వెనుక ఆ గ్రామ ప్రజల్లో పలు అనుమానాలు వినిపిస్తున్నాయి. రాజశ్రీ క్షుద్ర పూజలకు బలైందా..? కుటుంబ ఆర్థిక పరిస్థితుల క్రమంలో ఇల్లు వదిలి వేరే ప్రాంతానికి వెళ్లిందా..? ప్రేమ వ్యవహారం ఏమైనా దాగి ఉందా..? ర అనేదానిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారిందంటున్నారు.