ఊరూవాడా కదిలి, దేశమంతా స్వాతంత్ర్య దినోత్సవపు ఉత్సాహంతో ఉరకలెత్తుతోంది. చిరునవ్వులు చిందించే చిన్నారుల చిట్టి చేతుల్లో మువ్వన్నెల జెండా భావితరానికి ప్రతీకగా నిలుస్తుంటే... అందరికీ అన్నం పెట్టే రైతన్న చేతిలో మూడు రంగుల జెండా ముచ్చట గొలుపుతోంది. చొప్పదండి మండలంలోని కుర్మపల్లిలో మల్లికార్జున రెడ్డి అనే రైతు, పోయినేడాది నుంచి నేటి వరకు ప్రతిరోజు తన పొలంలో మువ్వన్నెల జెండా ఎగరవేస్తూ తన దేశభక్తిని చాటుతున్నాడు.
- మహిమల భాస్కర్‌రెడ్డి, సిద్దిపేట - అజయ్ సింగ్ ఠాకూర్, కరీంనగర్
