జ్యోతిష్యం: ఈ రాశులంటే శివుడికి మహాఇష్టం.. అందులో మీరాశి ఉందేమో చూసుకోండి..!

జ్యోతిష్యం:  ఈ రాశులంటే శివుడికి మహాఇష్టం.. అందులో మీరాశి ఉందేమో చూసుకోండి..!

ప్రతి ఒక్కరు కొంతమంది అంటే ఇష్టపడతారు.. కొన్ని వస్తువులంటే చాలా మక్కువగా ఉంటారు. భగవంతుడిని అందరూ కొలుస్తుంటారు. దేవుడి ఆశీస్సులు అందరికి ఉంటాయి.  కాని జ్యోతిష్య నిపుణలు తెలిపిన వివరాల ప్రకారం .. పరమేశ్వరుడికి కొన్ని రాసులంటే చాలా ఇష్టమని చెబుతున్నారు.  ఆ రాసుల వారికి శివుడి అనుగ్రహం కొంచెం ఎక్కువుగా ఉంటుంది.  ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . . 

మేషరాశి: ఈ రాశి వారికి శివుని అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది.  జాతక రీత్యా ఉన్న కొన్ని సమస్యలను బోలేనాథుడు తొలగిస్తాడు.   ఈ రాశి వారికి సహజంగా ధైర్యం.. ఉత్సాహంతో పాటు కొంత ఆధ్యాత్మిక శక్తి కలిగి ఉంటారని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.  ఆషాఢమాసంలో శివుడిని పూజించడం వలన కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  నూతన వెంచర్​లు ప్రారంభించే అనుకూలసమయం.  వీరు ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేయడం వల్ల ఆర్థికపరమైన కష్టాల నుంచి విముక్తి కలిగిస్తాడు.  జీవితంలో తలెత్తే ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి.

మిథున రాశి : ఈ రాశి వారికి పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి.  మీ మేథాశక్తిని.. నైపుణ్యాలను పెంచుకొనేందుకు శివుడు ఎంతో సాయపడతాడు. ఆషాఢమాసంలో శివుడిని పూజించడం వలన  ఈ రాశి వారిని  సంక్షోభాల నుంచి బోలేనాథుడు కాపాడుతాడు. వీరు చాలా సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు.  వీరిని ఎవరైనా ఇబ్బందులకు గురిచేయాలని చూస్తే పరమేశ్వరుడు మిథున రాశి వారికి రక్షణగాఉంటాడు.

సింహ రాశి :  ఈ రాశిలో  జన్మించిన వ్యక్తులకు శివుని  ఆశీస్సులు ఉంటాయి. ఆషాఢమాసంలో శివుడిని పూజించడం వలన వీరికి చాలా ఉపయోగం ఉంటుంది.  ఆఫీసులో వీరు చేసే పనికి గుర్తింపు లభించడంతో పాటు ప్రశంశలు పొందుతారు.  లీడర్​ షిప్​ క్వాలిటీస్​ మెరుగుపడతాయి. . 

కుంభ రాశి :శివునికి చాలా ఇష్టమైన రాశి కుంభరాశి. ఈ రాశి వారినీ అకాల మరణం నుండి శివుడు కాపాడుతాడు.శనిదేవుడు కుంభరాశిని పాలిస్తాడు. శివుడు ఎప్పుడు శనిదేవుని ఆదరంగా చూస్తాడు. కాబట్టి శనిదేవుని రాజైన కుంభరాశిపై కూడా తన కటాక్షాన్ని చూపిస్తూ ఉంటాడు. వీరి జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. వీరు కష్టపడి పని చేసేవారు మరియు శ్రద్ధ కలిగిన వారు. వారు తమ జీవితంలో పెద్ద సవాళ్లను కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. అటువంటి శక్తిని శివుడు వారికి ఇస్తాడు.

శివ ఆఙ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదని పండితులు అంటుంటారు.  సృష్టి... స్థితి.. లయ కారకుడైన పరమేశ్వరుడిని హర హర మహాదేవ శంభో శంకర అంటూ కొలుస్తారు.  కార్తీకమాసం తరువాత  శివుడికి ఆషాఢమాసం చాలా ఇష్టం.     శివుని ఆశీస్సులు పొందడానికి కోరుకున్న వరాలను సాధించడానికి ఆషాఢమాసమే ఉత్తమ సమయం. అయితే శివుడి కటాక్షం ఎప్పుడూ ఉండే కొన్ని రాశుల వారు ఉన్నారు. వారికి శివుడు ఎప్పుడూ రక్షా కవచంగా నిలిచి అనుగ్రహిస్తూ ఉంటాడు.