ఇంట్లోకి చొర‌బ‌డి రివాల్వ‌ర్, న‌గ‌దు డాక్యూమెంట్స్ ఎత్తుకెళ్లాడు

ఇంట్లోకి చొర‌బ‌డి రివాల్వ‌ర్, న‌గ‌దు డాక్యూమెంట్స్ ఎత్తుకెళ్లాడు

హైదరాబాద్: బంజారాహిల్స్ లోని ఓ బిల్డర్ ఆఫీస్ ‌లోకి ఓ వ్య‌క్తి చొరబడి రివాల్వర్ ‌తో పాటు.. కోట్లాది రూపాయల విలువైన భూముల డాక్యూమెంట్స్ చోరీ చేశాడు. ఈమేరకు బాధితుడు వీరపరెడ్డి కోటారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3 లోని తన ఆఫీసు అయిన శ్రీ అదిత్యా హోమ్స్.. ప్రయివేటు లిమిటెడ్ ‌లోకి తన బావమరిది బాలంరెడ్డి సుధీర్ రెడ్డి చోరీకి పాల్పడ్డాడని ఆరోపిస్తున్నాడు బాధితుడు. తన రివాల్వర్ ‌తో పాటు 20 తూటాలు చోరీ చేశాడని కోటారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు న‌మోదు చేసుకుని విచార‌ణ చేప‌ట్టామ‌న్నారు బంజారాహిల్స్ పోలీసులు.