ఈసారి ఫార్ములా–ఈ రేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేనట్లేనా!

ఈసారి ఫార్ములా–ఈ రేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేనట్లేనా!

న్యూఢిల్లీ: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరోసారి ఫార్ములా–ఈ..  రేసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చూడాలనుకున్న ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బ్యాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ న్యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ రేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహణకు కొత్త గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఇంకా అనుమతి రాలేదని నిర్వాహకులు వెల్లడించారు. దీంతో ఏర్పాట్లపై సందిగ్ధత నెలకొంది. ‘ఈ నెల ప్రారంభంలో మా సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులు కొత్త గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సమావేశం అయ్యారు. 

రేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు సంబంధించిన అగ్రిమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇతర వివరాలను వెల్లడించాలని ప్రభుత్వం కోరింది. ఈ మేరకు మాకు ఓ లేఖ ఇచ్చారు. దాని ప్రకారం చూస్తే వచ్చే ఏడాది రేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  షెడ్యూల్​ ప్రకారం జరగడం కష్టమేనని తెలుస్తోంది’ అని ఫార్ములా–ఈ  పేర్కొంది.  గతేడాది రేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహణకు సంబంధించి ఫార్ములా–ఈతో తెలంగాణ ప్రభుత్వం, గ్రీన్కో నాలుగేళ్ల పాటు ఒప్పందం చేసుకుంది.