రాచకొండలో 4,835 రోహింగ్యాలు..వీరిలో ఫేక్ ఓటర్లు

రాచకొండలో 4,835 రోహింగ్యాలు..వీరిలో ఫేక్ ఓటర్లు
  • వారిలో 4,561 మందికి
  • ఫేక్ ఆధార్‌‌, ఓటర్ ఐడీలు
  • సీపీ మహేశ్‌ భగవత్‌ వెల్లడి
  • బయోమెట్రిక్‌, ఐరిస్​ చెకింగ్‌ ద్వారా గుర్తించినం
  • రెండేండ్లలో వివిధ నేరాల్లో 165 మంది అరెస్టు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాచకొండ కమిషనరేట్​లోని 30 డివిజన్స్‌‌‌‌లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ మహేశ్‌‌‌‌ భగవత్‌‌‌‌ తెలిపారు. కమిషనరేట్‌‌‌‌ పరిధిలో 4,835 మంది రోహింగ్యాలు ఉన్నట్లు చెప్పారు. బయోమెట్రిక్, ఐరిష్‌‌‌‌ చెకింగ్‌‌‌‌ ద్వారా ఇందులో 4,561 మందికి ఫేక్ ఆధార్‌‌‌‌‌‌‌‌ కార్డులు ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. ఫేక్ డాక్యుమెంట్స్‌‌‌‌ ద్వారా ఆధార్‌‌‌‌‌‌‌‌ కార్డులు పొందిన24 మంది, ఓటర్‌‌‌‌‌‌‌‌ ఐడీలు పొందిన15 మందిని, నకిలీ పత్రాలతో డ్రైవింగ్‌‌‌‌ లైసెన్స్‌‌‌‌ తీసుకున్న నలుగురు, స్థానిక అడ్రెస్‌‌‌‌లతో పాస్‌‌‌‌ పోర్ట్స్‌‌‌‌ పొందిన 9 మంది, ఇద్దరు పాన్‌‌‌‌కార్డ్‌‌‌‌ హోల్డర్లను అరెస్ట్ చేశామని వివరించారు. మొత్తంగా  రెండేండ్లలో వివిధ నేరాల్లో 165 మంది రోహింగ్యాలను అరెస్ట్ చేసి రిమాండ్‌‌‌‌కు తరలించామన్నారు.

8 వేల మందితో బందోబస్త్‌‌‌‌

‘‘జీహెచ్ఎంసీ ఎలక్షన్స్‌‌‌‌ ముగిసే వరకు పటిష్టమైన నిఘా కొనసాగిస్తాం. రాచకొండ పరిధిలోని 30 వార్డుల్లో 8,000 మందితో బందోబస్తు ఏర్పాటు చేశాం” అని భగవత్ వివరించారు. ‘‘కమిషనరేట్‌‌‌‌ పరిధిలో మొత్తం 101 అత్యంత సమస్యాత్మక, 498 సమస్యాత్మక  పోలింగ్ స్టేషన్స్‌‌‌‌ గుర్తించాం” అని చెప్పారు.