లిక్కర్ స్కాంలో తొందరలోనే కవిత అరెస్ట్ : కేఏ పాల్

లిక్కర్ స్కాంలో తొందరలోనే కవిత అరెస్ట్  : కేఏ పాల్

ఎమ్మెల్సీ కవితను త్వరలోనే అరెస్ట్ చేస్తారన్న సమాచారం తనకు వచ్చిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరికొందరి పేర్లు బయటకు వస్తాయని చెప్పారు. దేశంలో అవినీతి తారాస్థాయికి చేరుకుందన్న ఆయన.. అంతర్జాతీయ మీడియా సంస్థలపై ఈడీ, ఐటీ, సీబీఐలను ఉపయోగించడం సరికాదని హితవు పలికారు. ఐటీ దాడులతో బీబీసీ గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. భారత మీడియా సంస్థల్లాగా అంతర్జాతీయ మీడియా నోరు మూయించలేరని, వాటిని కొనుగోలు చేయలేరని కేఏ పాల్ అన్నారు. 

కేంద్రాన్ని ఎదిరించి నిలబడ్డ సీనియర్ ఎన్టీఆర్ వంటి నాయకులు ఇప్పుడు లేకపోవడం దురదృష్టకరమని కేఏ పాల్ అన్నారు. ప్రస్తుతం నాయకులు, సీఎంలు మోడీకి బానిసలేనని, వారికి మోడీని ఎదిరించే ధైర్యం లేదని అన్నారు. కేసీఆర్ దళిత, బడుగు బలహీన వర్గాల ద్రోహి అని మండిపడ్డారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఏప్రిల్ 14న ప్రారంభించాలంటూ కేసీఆర్ కు 72 గంటల అల్టిమేటం జారీ చేశారు.