అంగరంగ వైభవంగా పెళ్లి : ప్రాణంలేని అతిథులే పెళ్లి పెద్దలు

అంగరంగ వైభవంగా పెళ్లి : ప్రాణంలేని అతిథులే పెళ్లి పెద్దలు

పెళ్లంటే ఎలా ఉండాలి. సినిమాల్లో చెప్పినట్లు ఊరంతా అరుగు. ఆకాశం అంత పందిరేసి.. చుట్టాలు, స్నేహితులు, బంధువులతో పెండ్లి మండపం కళకళలాడుతుంటే వరుడు, వధువు మెడలో తాళికట్టి తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. పెళ్లిళ్లు ఆయా సాంప్రదాయాలకు, మతాలకు అనుగుణంగా ఇంచు మించు ఇలానే జరుగుతుంటాయి.

కానీ  కరోనా ఎఫెక్ట్ తో ప్రపంచ దేశాల్లో జరగాల్సిన కోట్లాది పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. కొన్ని పెళ్లిళ్లు ఆన్ లైన్ ద్వారా జరుగుతున్నాయి. మరికొన్ని పెళ్లిళ్లను పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు.

అలాగే అమెరికా మిచిగాన్ కు చెందిన అమీ సిమోన్సన్, డాన్ స్లుగ్లిక్ లకు ఈరోజే పెళ్లి జరిగింది. కొద్దిరోజుల ముందు తమ పెళ్లికి రావాలంటూ వరుడు, వధువులిద్దరూ సుమారు 160మంది అతిథుల్ని ఆహ్వానించారు. కానీ కరోనా వైరస్ వల్ల తాము పెళ్లికి ఎవరూ హాజరు కాలేమని చెప్పారు.

ఇద్దరు అనుకున్న టైంకి పెళ్లి చేసుకోవాలనే అనుకున్నారు. కానీ అతిథులు హాజరుకాకపోవడంతో పెళ్లికూతురు అమీ డీలా పడింది. ఎలాగైనా పెళ్లి కుమార్తె అమీని సంతోష పెట్టాలని పెళ్లి కొడుకు స్టుగ్లిక్ బాగా ఆలోచించి చివరికి తన క్రియేటివీటితో 100మంది అనుకోని అతిధుల్ని ఆహ్వానించి అమీని వివాహం చేసుకున్నాడు.

ఇంతకీ ఆ అనుకోని అతిథులు ఎవరని అనుకుంటున్నారా..? అట్ట బొమ్మలు. పెళ్లికి  అట్ట బొమ్మలే అతిధులా అనే డౌట్ రావచ్చు. పెళ్లి కుమార్తె బాధపడటాన్ని చూడలేని పెళ్లి కుమారుడు స్టుగ్లిక్ బాగా ఆలోచించి 100అట్టు ముక్కలతో మనిషి ఆకారాల్ని తయారు చేసి చర్చిలో పెట్టి వివాహం చేసుకున్నాడు.